తెలంగాణ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం నో పర్మిషన్.!

Publish Date:Aug 21, 2026

Advertisement

తెలంగాణకు  పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపట్టిన  విదేశీ పర్యటన చివరి నిముషంలో రద్దైంది. .   బ్రిటన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం ఆయన నేరుగా అమెరికా చేరుకోవాల్సి ఉంది. అయితే  కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి  అనుమతులు లభించకపోవడంతో, అమెరికా  ఆయన తన అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకుని లండన్ నుంచే స్వరాష్ట్రానికి తిరుగుపయనం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

తెలంగాణ రైజింగ్  అనే ప్రత్యేక బ్రాండ్ పేరుతో సీఎం బృందం ఈ విదేశీ పర్యటనలను రూపొం దించింది. ఇందులో భాగంగా లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

అయితే ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన అనుమతులలో స్పష్టత లోపించింది. బ్రిటన్ వేదికగా జరిగే అధికారిక కార్యక్రమాలకు మాత్రమే విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. కానీ అమెరికాలో నిర్వహించతలపెట్టిన  సమావేశాలకు అనుమతి ఇవ్వలేదు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన  రద్దు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో  రేవంత్ ఈనెల 23న  లండన్ నుండి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది. 

Revanth Reddy US Tour Cancelled, Telangana Rising Summit, Ministry of External Affairs clearance, CM Revanth Reddy UK Visit, Telangana Investments News Telugu

By
en-us Political News

  
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.