వైసీపీ అనుకూల సీఐపై అత్యాచారం కేసు!

Publish Date:Apr 30, 2026

Advertisement

 

వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఇంత కాలం సీఐడీలో పనిచేసి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం కేసులో ఇరుక్కోవడం కలకలం  రేపుతోంది. మల్లయ్య తన ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి, తనపై అత్యాచారం చేశాడని భాధితురాలు వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన ఒక కుటుంబం కొంతకాలంలో మండలంలోని వేరే గ్రామంలో అద్దెకు ఉంటోంది. 

అదే గ్రామ వాసి అయిన  సీఐ చిన్నమల్లయ్య బుధవారం (29-4-26న) గ్రామానికి వచ్చాడు. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు చేసిన బాధితురాలికి ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి, సీఐ అకృత్యాన్ని నిర్ధారించారు. వైసీపీ హయాంలో సీఐడీ సీఐగా ఉన్న మల్లయ్య తెలుగుదేశం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నాయకుడిని గన్‌తో బెదిరించాడు. ఇటీవలే కారంపూడికి చెందిన టీడీపీ నేతలను వాట్సప్‌లో బెదిరించాడు. తాజాగా అత్యాచారం కేసులో చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వినుకొండ పోలీసులు తెలిపారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి ఎట్టకేలకు తొలగిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (మే 1) శుక్రవారం పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.