రాజ్యసభకు కాగ్రెసు నుంచి నలుగురికి ఛాన్స్

Publish Date:Mar 17, 2012

Advertisement

న్యూఢిల్లీ: శానససభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. సురేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతో తెలంగాణ నుంచి సురేష్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి కూడా సూచించినట్లు చెబుతున్నారు. కాగా, రాజ్యసభ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై ఈ విషయమై చర్చించారు. రాజ్యసభకు కాగ్రెసు నుంచి నలుగురు ఎన్నికయ్యే అవకాశం ఉంది.

రషీద్ అల్వీ స్థానంలో కర్ణాటకకు చెందిన జాఫర్ షరీప్‌ను గానీ బీహార్‌కు చెందిన షకీల్ అహ్మద్‌ను గానీ నామినేట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరో సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. కెఆర్ సురేష్ రెడ్డితో పాటు రేణుకా చౌదరి, వైయస్ వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి వంటి నాయకులు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన కె. కేశవ రావు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.