రజినీ పొలిటికల్ ఎంట్రీ… పచ్చి బూతులు మాట్లాడుతోన్న సీనియర్ డైరెక్టర్!
Publish Date:Jun 1, 2017
Advertisement
హీరోలు చాలా మందే వుంటారు! అందరూ స్టార్లు కారు! స్టార్లు కూడా చాలా మంది వుంటారు! అందరూ సూపర్ స్టార్లు కారు! ఇక రజినీకాంత్ అవ్వటం… సూపర్ స్టార్లు అందరికి కూడా సాధ్యం కాదు! అలాంటి ఫాలోయింగ్ అండ్ క్రేజ్ తలైవాది! ఆ కారణం చేతనే.. ఇప్పుడు తమిళ రాజీకయ, సినిమా ప్రముఖులు తెగ ఉలిక్కిపడుతున్నారు నరసింహ పేరు చెబితే! కబాలి పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయిపోయింది. అందుకే, ఇప్పుడు ఇక ఇంత కాలం నోరు మూసుకుని కూర్చున్న తమిళ పొటుగాళ్లందరూ రంకెలు వేస్తున్నారు! కమల్ హసన్ నుంచీ శరత్ కుమార్ దాకా అందరికీ రజినీ ఫోబియా పట్టుకుంది! మరీ ముఖ్యంగా, జయ, కరుణా ప్రభావం లేని ప్రస్తుత తమిళ రాజకీయ ముఖ చిత్రంలో రజినీ వచ్చేస్తే ఆయనే గాఢ్ ఫాదర్ అయ్యే ప్రమాదముంది! గ్యారెంటీగా రజినీకాంత్ సెన్సేషన్ సృష్టిస్తారని చెప్పలేకున్నా… పెద్ద పెద్ద వాళ్లు కూడా బెంబేలెత్తుతున్న తీరు చూస్తే పెను మార్పులు తప్పవనిపిస్తోంది! ఫ్యాన్స్ తో సమావేశమైన రజినీకాంత్ తమిళనాడులో మంచి పొలిటీషన్స్ లేరని ఒక కామెంట్ చేశాడు. అదే ఇప్పుడు భారతీరాజా అనే సీనియర్ దర్శకుడికి ఆగ్రహం తెప్పించింది. సూపర్ స్టార్ పై తిట్ల వర్షం కురిపించేలా రెచ్చగొట్టింది. తలైవాని విమర్శించ వద్దని ఎవ్వరమూ చెప్పకున్నా.. భారతీరాజా మాట్లాడిన మాటలు వింటే జుగుప్స కలుగుతుంది ఎవరికైనా! అంతలా దిగజారి మాట్లాడాడు ఎంతో సీనియర్ అయిన ఆయన! తమిళుడు కాని రజినీకాంత్ ఇప్పుడొచ్చి తమిళ ప్రజలపై పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదంటూనే… తమిళ రాజకీయ నేతలు మంచివారు కాదని అనటాన్ని తప్పుబట్టారు! కాకపోతే తనదైన స్టైల్లో మీతిమీరి మాట్లాడుతూ … మా నేతలు మంచి వారు కాకపోతే నువ్వు వస్తావా? నా భార్యకి గర్భం రాకపోతే నా బిడ్డకి నువ్వు తండ్రివి అవుతానంటావా? అంటూ వెకిలిగా ప్రశ్నించాడు భారతీరాజా! ఇప్పటికే తనని తాను గొప్ప ఫిలాసఫర్ గా ఫీలయ్యే కమల్ హాసన్ … రజినీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆయనకు కెమెరాలు ఎక్కడ వుంటాయో తెలుసునని ఇండైరెక్ట్ విమర్శలు చేశాడు. ఆయనని మించిపోయిన భారతీరాజా ఏకంగా బూతులు అందుకున్నాడు! ఇదంతా చూస్తుంటే… రజినీ ఎంట్రీతో తమిళ సినీ, రాజకీయ రంగాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువే అతలాకుతలం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది!
http://www.teluguone.com/news/content/rajinikanth-45-75246.html





