రూ. 5 కట్ చేస్తే రూ. 10 వేలు జరిమానా! రైల్వే శాఖకు షాకిచ్చిన కోర్టు!

Publish Date:Jun 17, 2026

Advertisement

సాధారణంగా ఐదు రూపాయలు తక్కువ వస్తే మనం ఏం చేస్తాం? పోన్లే అని వదిలేస్తాం. కానీ ఒక సామాన్య రైల్వే ప్రయాణికుడు మాత్రం అలా ఊరుకోలేదు. తన హక్కుల కోసం వినియోగదారుల కోర్టు తలుపు తట్టాడు. ఫలితంగా కేవలం 5 రూపాయల రీఫండ్ తక్కువ ఇచ్చినందుకు గాను భారతీయ రైల్వే శాఖకు ఏకంగా 10,000 రూపాయల భారీ జరిమానా పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఆసక్తికరమైన ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 28, 2023 న ఒక ప్రయాణికుడు తన కోసం, తన తండ్రి కోసం హిసార్ నుండి లుధియానాకు వెళ్లడానికి రెండు రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డ్ ద్వారా మొత్తం 330 రూపాయలు చెల్లించాడు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణానికి ఒక రోజు ముందే ఆ రెండు టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రైల్వే నిబంధనల ప్రకారం రద్దు ఛార్జీల (Cancellation Charges) కింద 240 రూపాయలు మినహాయించుకుని, అతనికి తిరిగి 90 రూపాయలు వాపసు ఇవ్వాల్సి ఉంది. కానీ అతని బ్యాంకు ఖాతాలో కేవలం 85 రూపాయలు మాత్రమే జమ అయ్యాయి.

కేవలం 5 రూపాయలు తక్కువ రావడంతో ఆ ప్రయాణికుడు రైల్వే అధికారులను, హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాడు. కానీ ఎక్కడా అతనికి సరైన సమాధానం గానీ, వివరణ గానీ లభించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు బాధితుడు న్యాయం కోసం లుధియానా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు.

ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రైల్వే శాఖ ఒక వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఆ 5 రూపాయలు తాము కట్ చేయలేదని, ప్రయాణికుడి బ్యాంక్ అయిన ఎస్‌బీఐ రీఫండ్ ఫీజుగా వసూలు చేసిందని బుకాయించే ప్రయత్నం చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే రీఫండ్‌లపై 5 రూపాయలు వసూలు చేయడానికి ఎస్‌బీఐకి అనుమతినిస్తూ 2017లో రైల్వే బోర్డు జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌ను కూడా కోర్టుకు సమర్పించింది.

కానీ ఈ వాదనను వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు సంజీవ్ బాత్రా, సభ్యురాలు మోనికా భగత్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. రద్దు చేసిన టిక్కెట్టుపై ఎక్కడా ఇటువంటి అదనపు రుసుము గురించి ప్రస్తావించలేదని కమిషన్ స్పష్టం చేసింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటి మినహాయింపుల సమాచారాన్ని బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు కనిపించేలా ప్రదర్శించాల్సి ఉండగా, రైల్వే శాఖ ఆ పని చేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. చివరికి లుధియానా స్టేషన్ మాస్టర్, డివిజనల్ మేనేజర్ వంటి సీనియర్ అధికారులకే ఈ ఒప్పందం గురించి తెలియదనే విషయాన్ని కమిషన్ ఎత్తిచూపింది.

ఖాతాదారుడికి ముందే సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా డబ్బులు మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ప్రయాణికుడికి ఉన్న 'సమాచారం పొందే హక్కు'ను రైల్వేలు ఉల్లంఘించాయని తేల్చింది. జూన్ 2 నాటి తన ఉత్తర్వుల్లో.. బాధితుడికి ఆ 5 రూపాయల బకాయిని తిరిగి ఇవ్వడంతో పాటు, మానసిక వేదనకు నష్టపరిహారంగా, కోర్టు ఖర్చుల కింద 10,000 రూపాయలు చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ జరిమానా చెల్లించకపోతే, ఆపై రోజుకు 200 రూపాయల చొప్పున అదనపు జరిమానా పడుతుందని కోర్టు హెచ్చరించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది.
 

By
en-us Political News

  
ఫిఫా వరల్డ్‌కప్‌ రౌండ్ 16లో అమెరికాకు ఘోర పరాజయం. 4 1 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన బెల్జియం. చార్లెస్ డీ కెటిలేరి అద్భుతమైన డబుల్ గోల్స్ హైలైట్.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు మేలో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఆటపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ సిరీస్ మరియు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
ప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ఇరాన్ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం మళ్లీ ఒక్కసారిగా శాంతి ఆశలను ఆవిరి చేసేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రెండు వాణిజ్య నౌకలను లక్ష్యంగా క్షిపణి దాడులకు తెగబడింది.
సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.