జిల్లాల పర్యటన ముగించుకుని వారం తరువాత అమరావతి చేరుకున్న చంద్రబాబు.!

Publish Date:Jul 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వారం రోజుల జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు నాలుగు జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసిన చంద్రబాబునాయుడు.. ఈ సందర్భంగా  పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే  వేల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులకు అంకురార్పణ చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సీబీఎన్ సాగించిన ఈ పర్యటన..  క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు  తెలుసుకుంటూనే..  రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే  పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

ఈ  పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలో  పేదల సేవలో కార్యక్రమంలో  పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో త్వరలోనే భారీ మెగా ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన ఆయన అలాగే..  దశాబ్దాలుగా నలుగుతున్న వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక తిరుపతి జిల్లా సత్యవేడులో పర్యటించి..  ప్రఖ్యాత హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు  శంకుస్థాపన చేశారు.

 రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ పథకం వీబీ జీ రామ్ జీ ని ఘనంగా ప్రారంభించారు. తిరుపతిలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొని, భవిష్యత్ పాలనలో డేటా అనలిటిక్స్,  డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు.

ఇక కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో   రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.  

చివరిగా  తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు బస చేసిన చంద్రబాబు..  స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' కార్యక్రమంలో  9 వేల 322 కోట్ల విలువైన 30కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో గ్లోబల్ బ్రాండ్ అడిడాస్ ఫుట్‌వేర్,  నుంచి పారిశ్రామిక విమానాల తయారీ ప్రాజెక్టు వరకు  భిన్న  పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 40 వేల  మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.  అలాగే.. 118 కోట్ల రూపాయలతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా.. ఆరు దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న కంగుంది భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేశారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు.  

AP CM District Tour, Swarna Kuppam Investments, JSW Rayalaseema Steel Plant, AP Economic Regions, Andhra Pradesh News

By
en-us Political News

  
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.