నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు.. నిదా ఖాన్‌కు బెయిలు.!

Publish Date:Jul 7, 2026

Advertisement

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్  యూనిట్ బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు  నాసిక్ కోర్టు కండీషన్డ్  బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిదాఖాన్ కుఅరెస్ట్ అయిన  2 నెలల తర్వాత   బెయిలు లభించింది. నాసిక్ రోడ్ కోర్టు అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తౌసిఫ్ అత్తార్‌కు   బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో  మరో కీలక నిందితుడు డానిష్ షేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు   తిరస్కరించింది.  

నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, యూనిట్ లో  మతమార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత  పరారయ్యారు. దాదాపు 42 రోజుల పాటు  అజ్ఝాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు  మేలో  అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు కావడం, అలాగే తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, జైలు వాతావరణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంటూ  నిదా ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.  

కార్పొరేట్ రంగంలో కలకలం రేపిన ఈ వ్యవహారంలో పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.  ఈ  వివాదంపై దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ యాజమాన్యం కూడా తక్షణమే స్పందించింది. నిందితులైన ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.  

TCS Nashik conversion case, Tata Consultancy Services BPO controversy, SIT investigation Maharashtra

By
en-us Political News

  
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..
“హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.