పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారి కాల్చివేత.. ఎందుకో తెలుసా?
Publish Date:Jul 6, 2026
Advertisement
పాకిస్థాన్ లో అరాచకం ఏ స్థాయిలో ఉందంటే.. అక్కడ అన్యాయాన్ని, అరాచకాన్ని ఎదిరించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వాధికారులైనా, సైన్యం, వాయుసేన అధికారులైనా జరుగుతున్న అక్రమాలను కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే. అలా కాదని ఆపడానికి ప్రయత్నిస్తే.. ప్రాణాలు హరీ మంటాయి. ఇందుకు తాజా ఉదాహరణే.. మహిళ కిడ్నాప్ యత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి హత్య. బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఆమె కొలీగ్. ఆఫీస్ పని ముగిసిన తర్వాత అతడు లిఫ్ట్ ఇస్తానంటే నమ్మి బైక్ ఎక్కానని, కానీ అతడు నమ్మకద్రోహం చేసి, దారి మళ్లించి జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడనీ.. . తనను కాపాడబోయి ఒక గొప్ప అధికారి ప్రాణాలు కోల్పోవడంపై దారుణమనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన ఆర్మీ వీఐపీ జోన్ పరిధిలో ఈ ఘోరం జరగడం పాక్ రక్షణ వ్యవస్థ డొల్ల తనాన్నీ, ఆ దేశంలో అరాచక శక్తుల ఆగడాలనూ తేట తెల్లం చేస్తోంది. Asim Tariq shot dead, Islamabad VIP zone shooting, woman kidnapping foil Pakistan, Shaheen Chowk incident
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున, అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై-సెక్యూరిటీ వీఐపీ జోన్‌లో ఆదివారం (జులై 5)ఈ ఘోరం జరిగింది. జరిగిపోయింది. ఒక మహిళను కిడ్నాప్ నుంచి కాపాడాలని ఆ అధికారి చేసిన ప్రయత్నం ఆయన ప్రాణాలను తీసింది. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌లో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ ఆదివారం (జులై 5)న షాహీన్ చౌక్ వద్ద ఒక మహిళ మోటార్ సైకిల్‌పై ఉన్న వ్యక్తితో తీవ్రంగా గొడవ పడటం ఆయన కంటపడింది. ఆ మహిళ రక్షణ కోసం ఆరాటపడుతోందని, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని గ్రహించిన అసీమ్ తారిఖ్.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
http://www.teluguone.com/news/content/pak-air-force-officer-shot-dead-36-225139.html





