Publish Date:Oct 10, 2019
సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను నడిపినట్లు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్... ఆ సంఖ్యను వందశాతానికి పెంచుతామన్నారు. డీఎస్పీ ఇన్‌ఛార్జ్‌గా ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. ప్రతి బస్సులోనూ పాసులను కచ్చితంగా అనుమంతించాల్సిందేనన్న మంత్రి పువ్వాడ.... టికెట్ ధర కంటే అధికంగా వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాత్కాలిక సిబ్బందిని హెచ్చరించారు.
ప్రతి బస్సులోనూ టికెట్ ధరల పట్టిక పెడతామని, అందులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా తాత్కాలిక సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికులు కూడా టికెట్ ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని పువ్వాడ సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రతి బస్సులోనూ పెడతామని, ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే, ఫిర్యాదు చేయ్యొచ్చని తెలిపారు. ఇక, దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా... అవసరమైన మేర బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. 14నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో... అన్ని డిపోల నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. ప్రస్తుతం 5వేలకు పైగా బస్సులను నడుస్తున్నాయన్న మంత్రి పువ్వాడ అజయ్.... ఇవాళ్టి నుంచి మొత్తం బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామన్నారు.
అయితే, 50శాతానికి పైగా బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రోడ్లపై మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు... తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ రైళ్లను ఆశ్రయిస్తుండటంతో... ట్రైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/puvvada-ajay-kumar-press-meet-on-rtc-strike-25-89934.html
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!