ఐపీఎల్ 2026..వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ జైత్ర యాత్ర

Publish Date:Apr 19, 2026

Advertisement

ఐపీఎల్ 2026 లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇది పంజాబ్‌కు వరుసగా ఐదో గెలుపు కాగా, లక్నోకు ఇది మూడో ఓటమి. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య  37 బంతుల్లో 93, కూపర్ కానొలీ  46 బంతుల్లో 87 పరుగులు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.  వీరి మెరపు బ్యాటింగ్ తో  పంజాబ్ ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో రెండు వికెట్లు తీశారు.

255 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన  లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 200 పరుగులు మాత్రమేచేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (40), కెప్టెన్ రిషభ్ పంత్ (43), ఐడెన్ మార్క్‌రమ్ (42) రాణించినా ఫలితం లేకపోయింది.  కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో లక్నో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.

పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. మార్కో జాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాఖ్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వరుస ఓటములతో లక్నో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. 

By
en-us Political News

  
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.