శిధిలాల కింద నుంచి 96 గంటల తరువాత ప్రాణాలతో బయటకి!

Publish Date:Jun 28, 2026

Advertisement

 

ప్రకృతి ప్రకోపానికి ఆ  అల్లకల్లోలమైపోయిన వెనిజువెలా ప్రస్తుతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా కూలిన భవనాలు, కాంక్రీట్ దిబ్బలు, గుండెలు పగిలేలా ఏడుస్తున్న బాధితుల రోదనలు మాత్రమే కనిపిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన ఈ ఘోర భూకంపం సృష్టించిన ప్రళయంలో  1,450 మందికి పైగా   ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయారు.  

50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.  భూకంపం సంభవించి నాలుగు రోజులు గడిచిపోవడంతో శిధిలాల కింద ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అంతా ఆశలు వదిలేసుకుంటున్న వేళ..  మరణం అంచుల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 96 గంటలు శిధిలాల కింద చిక్కుకుపోయిన తండ్రీ కొడుకులు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా జనం భావిస్తున్నారు. సాధారణంగా  భూకంపం సంభవించిన   మొదటి 72 గంటలను  గోల్డెన్ అవర్స్‌గా భావిస్తారు. ఈ 72 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న మనుషులు ప్రాణాలతో బతికే అవకాశాలు దాదాపు శూన్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ, ఆ కాలపరిమితిని సైతం అధిగమించి, ఏకంగా 96 గంటల పాటు చావుతో పోరాడి ఆ తండ్రీకొడుకులు ప్రాణాలను నిలుపుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్రాన్స్, అమెరికా దేశాలకు చెందిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో లా గుయ్‌రాలో గాలింపు చర్యలు చేపట్టాయి. వారు ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ కెమెరాలు, లైఫ్ డిటెక్టర్ పరికరాల సహాయంతో ఒక భారీ కాంక్రీట్ దిబ్బ కింద జీవకళ ఉన్నట్లు గుర్తించారు. లోపల ప్రాణాలతో  ఉన్నారని తెలియగానే రెస్క్యూ  అత్యంత జాగ్రత్తగా శకలాలను తొలగిస్తూనే, మరోవైపు లోపలికి ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ద్రవాలను పంపేందుకు ఏర్పాట్లు చేశారు. చీకటి గుహలాంటి ఆ శిథిలాల గుండా పైపుల ద్వారా ద్రవాలను అందిస్తూ వారి శరీరంలో జీవశక్తి తగ్గకుండా చూశారు.

దాదాపు 12 గంటల పాటు అత్యంత క్లిష్టంగా, ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఆదివారం నాడు ఆ తండ్రీకొడుకులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. 96 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఆ ఇద్దరూ తీవ్రమైన అలసట, డీహైడ్రేషన్‌తో స్పృహతప్పే స్థితిలో ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర అత్యంత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. కేవలం ఈ ఇద్దరే కాకుండా, శని, ఆదివారాల్లో నిర్వహించిన ముమ్మర రెస్క్యూ ఆపరేషన్లలో అంతర్జాతీయ బృందాలు మొత్తం 33 మందిని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద నుండి ప్రాణాలతో కాపాడాయి. ఈ అద్భుత రెస్క్యూ ఘటనలతో బాధితుల కుటుంబాల్లో   అక్కడ శ్రమిస్తున్న సహాయక సిబ్బందిలో కొత్త ఆశలు చిగురించాయి. ఇంకా ఎంతో మంది శిథిలాల కింద ప్రాణాలతో ఉండే అవకాశం ఉందనే నమ్మకంతో అంతర్జాతీయ బలగాలు ప్రస్తుతం అక్కడ యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

By
en-us Political News

  
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.