టి20 సిరీస్.. టీమ్ ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్

Publish Date:Jun 28, 2026

Advertisement

పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు   పరాభవం ఎదురైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించి  రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో  ఓటమితో టీమిండియా 16 సిరీస్‌ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్  బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్   హాఫ్ సెంచరీతో రాణించగా, బెంజమిన్ 37 పరుగులు చేశాడు.  భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు.

 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. , ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ  46 బంతుల్లో 55 ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా  10 బంతుల్లో 21 మెరుపులు మెరిపించినా..  భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఐర్లాండ్ బౌలర్లలో జై మూంద్రా, మాథ్యూ హొల్లార్డ్ చెరో 3 వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్క్ అడైర్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఐర్లాండ్ ఈ అద్భుత విజయం సాధించడం విశేషం. టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి సిరీస్ లోనే ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. 

ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌  మాట్లాడుతూ..  పిచ్‌ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని ప్రశంసించాడు.   పిచ్ ను అంచనా వేయడలో తాము విఫలమయ్యామని చెప్పిన టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.. ఆ విషయంలో ఐర్లాండ్‌ మమ్మల్ని పూర్తిగా మించిపోయిందన్నాడు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజధానిగా అమరావతి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌..
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.