వేడివేడి బజ్జీలు వికటించి.. 23 మందికి ఫుడ్ పాయిజన్

Publish Date:Jun 29, 2026

Advertisement

 

వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు. రహదారి పక్కన బండిపై విక్రయిస్తున్న బజ్జీలను కొనుగోలు చేసి తిన్నారు. అయితే ఆ రుచి క్షణాల్లోనే చేదు అనుభవంగా మారింది. బజ్జీలు తిన్న కొద్దిసేపటికే ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రహదారి పక్కన బండిపై విక్రయించిన బజ్జీలు తిన్న మొత్తం 23 మందిలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. బాధితులకు వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బజ్జీల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది.

ఫుడ్ పాయిజన్‌కు కారణం కలుషిత నూనెనా, నాసిరకం పదార్థాలా, లేక పరిశుభ్రత లోపమా అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

By
en-us Political News

  
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ, ప్రకృతి సాగుతో పంటలు పండించి, భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.