దేశ ప్రజలకు ప్రధాని మోడీ థ్యాంక్స్.. ఎందుకంటే?
Publish Date:Jun 29, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ధ్యాంక్స్ చెప్పారు. ఆదివారం (జూన్ 28) ఆకాశవాణి ద్వారా ప్రజలతో మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. అంతర్జాతీయంగా ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంలో ఇండియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి రుజువైందన్నారు. ఇంతకీ విషయమేంటంటే.. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇంధనాన్ని కూడా పెద్ద ఎత్తున పొదుపు చేయాలని కొన్ని రోజుల కిందట పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన పిలుపు మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేశారు. అలాగే ఇంధన పొదుపు కూడా పాటించారు. దీనినే తన మన్ కీబాత్ లో ప్రస్తావిస్తూ.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం సీషెల్స్ అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి తన 135వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు కనబరిచిన ఈ అసాధారణ క్రమశిక్షణ, సామూహిక సహకారం ఐక్యతకు, అంతర్గత శక్తికి నిదర్శనమన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు కొత్తగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి దూరంగా ఉన్నాయనీ, అలాగే ఇంట్లో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కూడా కొత్త బంగారం కొనకుండా, పాత బంగారు ఆభరణాలనే వినియోగించారనీ ప్రధాని చెప్పారు. అలాగే.. దేశంలో ఇంధన వాడకాన్ని తగ్గించడానికి కూడా ప్రజలు ప్రయత్నించారని మోడీ వివరించారు. అనేక మంది తమ విదేశీ పర్యటనలను వాయిదా వేసుకున్నారని, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించారని, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతంగా ఆశ్రయించడం ద్వారా దేశంలో భారీగా ఇంధనాన్ని ఆదా చేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సామూహిక కృషి అంతర్జాతీయ వేదికపై భారతదేశ స్థానాన్ని, ప్రతిష్టను ఇనుమడింప చేస్తుందన్నారు. ఇంకా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ యోగా ఆసనాల ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్స్ కనబరిచిన అద్భుత ప్రతిభను అభినందించారు. ఈ ప్రపంచ స్థాయి పోటీలలో భారత్ ఏకంగా 102 స్వర్ణ పతకాలతో దూసుకుపోవడమే కాకుండా, మొత్తం 114 పతకాలను సొంతం చేసుకుని అంతర్జాతీయ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రధాని
http://www.teluguone.com/news/content/pm-modi-thanks-the-people-of-the-country-36-224428.html





