మౌన ముని మన్మోహన్

Publish Date:Jan 13, 2013

Advertisement

 

బహుశః మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు గారి శిష్యరికం చేయడం వల్లనే ఆయన మౌనదీక్షను పుణికిపుచ్చుకోన్నారో మరేమో తెలియదు గానీ మన ప్రధాని మన్మోహన్ సింగు అక్షరాల అయనకి ఈ విషయంలో సరయిన వారసుడని చెప్పవచ్చును. అయితే, నరసింహారావుగారిని ఇదే విషయాన్నీ పత్రికలవాళ్ళు అడిగినప్పుడు, అయన “ఎవరన్నారు నేను స్పందించడం లేదని? నా మౌనం కూడా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే” అని తెలివిగా పలికి తప్పించుకొన్నారు. అయితే మన్మోహన్ సింగు మాత్రం ఆమాట కూడా అనలేకపోయారు.

 

దేశంలో ఎంత పెద్ద సంచలనం లేదా ఉపద్రవం తలెత్తినాకూడా ఆయన పెదవి విప్పి ప్రజలకి నేనున్నాని భరోసా ఇవ్వరు. ఒకవేళ నోరు విప్పినా అది ఓ మొక్కుబడి తంతుగా ఉంటుందే తప్ప నిజంగా హృదయంలోంచి వచ్చిన స్పందనగా మాత్రం కనిపించదు. గత నెల, డిల్లీలో జరిగిన ఘోర అత్యాచారంపై దేశమంతా ముక్త కంఠంతో నిరసనలు తెలియజేస్తుంటే, స్పందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తప్ప, తనది కాదన్నట్లు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు. దేశాన్నిపాలిస్తున్న ఒక సమున్నత ప్రభుత్వాధినేతగా స్పందించకపోవడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు మాత్రమే దీనిపై స్పందిస్తుండటంతో, విపక్షాలు నిలదీసినప్పుడు మాత్రమే ఆయన మొక్కుబడిగా స్పందిచేరు.

 

అయన తన చర్యలతో తను, తన ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే పరోక్షంగా దేశాన్ని పాలిస్తున్నట్లు మరోమారు ఋజువు చేసారు. ఆదేవిదంగా, పలు కీలక అంశాలయిన తెలంగాణా సమస్య, మణిపూర్ అల్లర్లు వంటి వాటిపై మన్మోహన్ సింగు కూడా ఆయన పెదవి విప్పిందిలేదు. అందువల్లే నేడు, మన రాష్ట్రంలో నేతలు, మంత్రులు నేరుగా సోనియా గాంధీని కలిసి సమస్యలు విన్నవించుకొని ఆమె నుండి పరిష్కారాలు ఆశిస్తారే తప్ప ప్రధాన మంత్రిని కలవాలని ఎవరూ అనుకోరు. నిర్ణయాలు ప్రకటించే అధికారం లోపించినట్లు ప్రవర్తిస్తున్నఆయన తీరుతో ప్రధాన మంత్రి పదవికూడా ఒక రబ్బర్ స్టాంప్ పదవేనన్న భావన ప్రజలలో కలిగిస్తున్నారు.

 

మళ్ళీ, ఇటీవల కొద్ది రోజులుగా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పూంచ్ సరిహద్దు వద్ద పాకీస్తానీ సైనికులు చేసిన దురాగతం పట్ల, పాక్ ఆగడాల గురించీ ఆయన నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఆయన ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంలో ఏ చర్యలు తీసుకొంటున్నారో ప్రజలకి పత్రికలూ టీవీ చాన్నాళ్ళ ద్వారా తెలుసుకోవాలి తప్ప, ఆయన స్వయంగా నోరువిప్పి ప్రజలకి తెలియజేయాలనుకోలేదు. మళ్ళీ, ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకీ, సోనియా గాంధీకే అప్పగించేసినట్లు కనిపిస్తోంది.

 

అయన నిర్లిప్తధోరణిపై స్పందించిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక, ఇటువంటి విషయాలలో హృదయపూర్వకంగా స్పందించే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో పోలుస్తూ ఒక వ్యాసం కూడా ప్రచురించింది. అమెరికాలో కొద్ది కాలం క్రితం న్యూయార్క్ నగర ప్రజలని శాండీ తుఫాను గడగడ లాడించినప్పుడు, అయన తన జీవితంలోనే అత్యంత కీలకమయిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా పక్కన బెట్టి స్వయంగా రంగంలోదిగి అక్కడి ప్రజలకు ఏవిదంగా భరోసా ఇచ్చేడో అందరికీ తెలిసిందే.

 

అదే విదంగా అ తరువాత కనెక్టికట్ నగరంలో స్కూలులో చదువుకొంటున్న చిన్నారులను ఒక ఉన్మాది పొట్టన పెట్టుకోన్నపుడు కూడా ఒబామా చేసిన భావోద్వేగప్రసంగంతో ప్రజల మన్ననలు పొందగలిగేరు. ఒక ప్రముఖ అంతర్ జాతీయ పత్రిక టైమ్స్ పత్రిక మనోమోహన్ గురించి వ్రాస్తూ ‘అండర్ ఎచీవర్’ (అసమర్దుడు) అని కవర్ పేజీ ఆర్టికల్ కూడా వ్రాసేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడి దిద్దుబాటు చర్యలు చేపటింది. గానీ మళ్ళీ షరా మామూలుగానే సాగిపోతోంది ఆయన, కాంగ్రెస్ పార్టీ ధోరణి.

 

ఒక సంఘటన లేదా ఒక ఉపద్రవంపై మన ప్రధాని వెంటనే స్పందించడం మనం ఎన్నడూ చూసి ఉండలేదు. ఒక వేళ స్పందించినా అది రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప నిజమయిన హృదయ స్పందనలా మాత్రం ఉండదు. ప్రతీ చిన్న, పెద్ద అంశాన్నికూడా రాజకీయ రంగుటద్దాలలోంచి తప్ప వేరేలా చూడలేని దౌర్భాగ్య పరిస్థితులవల్లనే, అయన వెనకంజ వేయక తప్పట్లేదు అనుకొని జనం సర్ది చెప్పుకోక తప్పదు.

By
en-us Political News

  
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు తీవ్ర కరవు పరిస్థితులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు
ఈడీ దాడులతో బట్టబయలవుతున్న మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి బాగోతం.!
ఎన్నికల్లో గెలవాలనే ఆశ.. ప్రజల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నం.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల! కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
మోడీ ఫోన్ లో తుపానుల వల్ల సంభవించిన నష్టం వివరాలకు అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలను  ఈ సందర్భంగా చంద్రబాబు  ప్రధానికి  వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.