ప్రకాశంజిల్లా డిసిసి అధ్యక్షుడుగా గొట్టిపాటి?
Publish Date:Mar 13, 2012
Advertisement
ప్రకాశంజిల్లా: ప్రకాశంజిల్లా డిసిసి అధ్యక్షుడుగా ఉన్న పోతుల రామారావును మార్చాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికల నేపధ్యంలో సమర్ధుడైన వ్యక్తిని డిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే తప్ప పార్టీని నెట్టుకురాలేమన్న యోచనలో అధిష్టానం ఉంది. దీంతో డిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై అధిష్టానం తర్జన భర్జనపడుతోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను డిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి పూర్వవైభవం లభిస్తుందని కొందఱు సీనియర్ నాయకులు భావిస్తున్నారు. వివాద రహితుడుగా పెరోపొందిన గొట్టిపాటి రవికుమార్ ను డిసిసి అధ్యక్షునిగా నియమిస్తే ఎవరూ వ్యతిరేకించక పోవచ్చునని తెలుస్తోంది. అయితే ఆయన ఈ బాధ్యతలను స్వీకరిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గొట్టిపాటి రవికుమార్ ఎప్పుడూ సొంత వ్యాపారాలు, సొంత వ్యవహారాలతో బిజీగా ఉంటారు. ఆయన గతంలో ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి తరచుగా వచ్చిన సందర్భాలు కూడా లేవు. దీనికి తోడు జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పార్టీ కేడర్ అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం పార్టీ జెండాలు మోసే కార్యకర్తలు కరువయ్యాయి. ఈ నేపధ్యంలో డిసిసి అధ్యక్ష బాధ్యతలను మోయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
http://www.teluguone.com/news/content/prakasam-district-24-12580.html





