కృష్ణానదికి నీటి కొరత
Publish Date:Mar 13, 2012
Advertisement
కృష్ణా జిల్లా: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నదుల్లో కృష్ణా, గోదావరి అగ్రభాగాన ఉన్నాయి. కానీ ప్రతికూల వాతావరణం, వర్షాభావం కారణంగా గోదావరి నది ఇప్పటికే ఎండింది. ఇప్పుడు ఆ దుస్థితి కృష్ణానదికి కూడా దాపురించింది. ఎగువప్రాంతంలో వర్షాలు లేక కృష్ణానది ప్రవాహం నిలిచిపోయింది. దీంతో జూరాల రిజర్వాయర్ కు నీటి చేరిక ఆగిపోయింది. గత 30 ఏళ్లలో జూరాల రిజర్వాయర్ కు పూర్తిగా నీరు నిలిచిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జూరాల ప్రాజెక్టును 67 క్రష్ట్ గేట్లతో 1000 మీటర్ల పొడవునా నిర్మించారు. అయితే గత 18 సంవత్సరాలుగా వీటికి ఎటువంటి నిర్వహణ లేదు. ఫలితంగా రబ్బర్ బీడింగుల్లో లీకేజీ ఏర్పడింది. దీంతో 30 క్రష్ట్ గేట్ల ద్వారా రిజర్వాయర్ లో నిలువ ఉంచిన నీరు లీకై దిగువ ప్రాంతాలకు వృధాగా పోతోంది. అసలే కృష్ణానది నీటి కొరతను ఎదుర్కొంటుండగా రిజర్వాయర్ లో నిలువ ఉంచిన నీరు లీకై దిగువ ప్రాంతాలకు వృధాగా పోతోంది. అసలే కృష్ణానది నీటి కొరతను ఎదుర్కొంటుండగా రిజర్వాయర్ లో ఉన్న కొద్దిపాటి నీరు కూడా ఇలా వృధా అవుతుండటంతో ఈ నీటిపై ఆధారపడిన వేలాదిమంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/krishna-district-24-12579.html





