పొలిటికల్ హీట్.. వేసవి ఎండలను మించి!

Publish Date:May 1, 2026

Advertisement

తెలంగాణలో రాజకీయ వాతావరణం   వేడెక్కుతోంది.  వెసవి ఎండలను తలదన్నేలా.. పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.  అటు బీఆర్ఎస్ వరుస భేటీల‌తో కేడర్‌లో జోష్ నింపుతుంటే, ఇటు ప్రధాని మోడీ పర్యటనతో బీజేపీ సైతం భారీ ఏర్పాట్లతో ఉత్సాహం చూపుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ వరుసగా పార్టీ మీటింగ్ లు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ తన రైతు డిక్లరేషన్  హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ.. వరంగల్‌లో బీఆర్ఎస్ ఈనెల 6న  భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 

ఇటీవ‌వ‌ల‌ జరిగిన జిల్లా నాయకుల సమావేశంలో  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో  కరెంటు కోతలు పెరిగాయనీ, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందనీ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయని, దీనిపై పోరాడాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు  తెలంగాణను కాపాడుకుందాం  అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. 

ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 8 వేల‌ కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు   శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈసందర్భంగా జనాగ్రహ సభను భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది.  క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వ‌హించ‌డంలో భాగంగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద‌గ్గ‌ర‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఇప్పటికే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి  తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది. మాములుగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి రాజ‌కీయ సంద‌డి క‌నిపిస్తుంది.. కానీ అంత‌క‌న్నా ఒక‌డుగు ముందే ఇక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన‌ట్టు క‌నిపిస్తోంది.  ఒక ప‌క్క బీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ అనే క‌విత పార్టీ రాక‌డ‌తో.. తన ఉనికిని చాటుకోవడానికి, మరోవైపు బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో మే నెల  ఎండ‌ల‌ను మించిన రాజ‌కీయ హీట్ పెరిగినట్లు కనిపిస్తోంది. 

By
en-us Political News

  
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.