మైనర్ బాలికను బాస్కెట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కౌలార్‌లోని గౌర్డియమ్ స్కూల్ అండ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాధిత బాలిక గత మూడేళ్లుగా బాస్కెట్‌బాల్ ఆడుతోంది. ఈ క్రమంలోనే పలు టోర్న మెంట్లలో పాల్గొంటున్న ఆమెను పృథ్వీశ్వర్ రెడ్డి పలుమార్లు అసభ్యకర వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2024 ఫిబ్రవరి 18న జోగులాంబ గద్వాల్ జిల్లా ఉట్నూర్ జెడ్పీ మైదానంలో జరిగిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో మహిళల ఫైనల్ మ్యాచ్ అనంతరం నిందితుడు బాలికతో పాటు ఇతర మహిళా క్రీడాకారుల వైపు అసభ్యకరమైన సంజ్ఞలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు కూడా బాలికను ఉద్దేశించి లైంగిక, కులపరమైన అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా 2025 డిసెంబర్ 21న మాదా పూర్‌లోని డీబీఏ అకాడమీలో జరిగిన వర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ లో బాలిక శారీరక రూపాన్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2026 జూన్ 7న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జెడ్పీ హెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన టోర్నమెంట్‌లోనూ బాలికను పోటీలో పాల్గొన డంపై ప్రశ్నిస్తూ, డాక్యు మెంట్లు కోరడంతో పాటు దూషణలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలపై బాలిక తల్లిదండ్రులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిం చారు. తొలుత గత నెల 24న ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అనంతరం దానిని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 1105/2026 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75(1)(iv)తో పాటు పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
POCSO case against basketball coach, minor girl, Coach Prithviraj Reddy, DBA Academy,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pocso-case-against-basketball-coach-36-228002.html
క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై కీలక అప్‌డేట్! రూ.11,000 కోట్ల అంచనా వ్యయంతో 38.40 కిలోమీటర్ల మేర 2 కారిడార్లు, 34 స్టేషన్ల నిర్మాణం. గన్నవరం, కేసరపల్లిలో 91 ఎకరాల భూసేకరణ వివరాలు ఇవే!
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ 2026 టైటిల్ గెలుచుకుని హిస్టారిక్ విక్టరీ సాధించాడు. 23/35 పాయింట్లతో అమెరికాలో గ్రాండ్ చెస్ టూర్ ట్రోఫీని కైవసం చేసుకున్న ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పూర్తి వివరాలు ఇవే!
సోనీ ఇన్‌జోన్ M10S 2 గేమింగ్ మానిటర్ పూర్తి రివ్యూ! 540Hz రిఫ్రెష్ రేట్, 720Hz డ్యూయల్ మోడ్, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 0.02ms రెస్పాన్స్ టైమ్‌తో కూడిన ఈ బెస్ట్ ఇ స్పోర్ట్స్ OLED మానిటర్ ధర మరియు ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ టీన్ డ్రామా మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 4కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సీజన్ 3 ముగింపు ట్విస్ట్‌లు, షూటింగ్ వివరాలు మరియు రిలీజ్ విండో గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
షియోమీ నుంచి కొత్త స్కైనోమాడ్ N70, N90 ఫుల్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు వచ్చేశాయి. ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 314 మైళ్ల ఎలక్ట్రిక్ రేంజ్ మరియు మొత్తం 1,705 కిలోమీటర్ల కంబైన్డ్ మైలేజ్ ఇచ్చే ఈ కార్ల ఫీచర్లు, ఇంజన్ అండ్ ధర వివరాలు ఇక్కడ చూడండి!
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీల భారాన్ని ఎవరు మోస్తారు? ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందన, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బిల్లు మరియు యూపీఐ ఛార్జీల సమగ్ర విశ్లేషణ.
మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు అత్యధిక వడ్డీని అందిస్తున్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు, DICGC రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సెక్యూరిటీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూకేలో మీ NICOP కార్డ్ పోయిందా? కంగారు పడకుండా నాద్రా పాక్ ఐడెంటిటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రీప్లేస్ చేసుకునే అప్లికేషన్ స్టెప్స్, పోలీస్ రిపోర్ట్, ఫీజుల వివరాలు £55.50 £165 మరియు డెలివరీ టైమ్‌లైన్స్ తెలుసుకోండి.
అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు శుభారంభం చేశారు. జావెలిన్ త్రోలో ఆశీష్ యాదవ్ 69.87 మీటర్లతో టాప్ సాధించగా, డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. పూర్తి వివరాలు చదవండి!
కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శ్రీయాన్షి వాలిశెట్టిపై 57 నిమిషాల థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సాధించిన ఈ విజయం మరియు ఇతర భారత షట్లర్ల ప్రదర్శన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును సమీక్షించింది. ఈ సమీక్షలో 9 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. వాటిలో టెక్నాలజీ వినియోగం, బాధితులకు ఫిర్యాదుల పట్ల స్పందించే వేగం, రికవరీ వ్యవస్థల సమర్థత విభాగాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ముందు ఉందని తేలింది.
మోదీ షేర్ చేసిన ఈ తాజా రీల్ లో దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో చేనేత రంగానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశీయ చేనేత ఉత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా పేర్కొంటూ నేత రంగాన్ని బలోపేతం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, యువత చేనేత ఉత్పత్తులపై తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకోవాలని కోరారు.