ఆకట్టుకుంటున్న మోడీ రీల్స్.!
Publish Date:Aug 7, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోదీ యువతతో మమేకమయ్యేందుకు డిజిటల్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. సరికొత్త డిజిటల్ వ్యూహాన్ని ఎంచుకున్నారు. యువత, ముఖ్యంగా జెన్ జీ , జెన్ ఆల్ఫా వర్గాలతో నేరుగా సంభాషించేందుకు మోడీ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ వేదికగా ఎంచుకున్నారు. తాజాగా మోడీ ఇన్ స్టాగ్రామ్ లో రీల్ పోస్టు చేశారు. ఈ రీల్ ద్వారా దేశంలో రంగాని ప్రచారం కల్పిస్తూ, న్యూ స్టైల్ లో మోడీ కనిపించారు. మోదీ షేర్ చేసిన ఈ తాజా రీల్ లో దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో చేనేత రంగానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశీయ చేనేత ఉత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా పేర్కొంటూ నేత రంగాన్ని బలోపేతం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, యువత చేనేత ఉత్పత్తులపై తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకోవాలని కోరారు. ప్రస్తుతం సాంకేతిక విప్లవం కొనసాగుతున్న వేళ, యువత ఎక్కువ కాలం గడిపే ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో రాత్రి వేళల్లో వరుస రీల్స్ పోస్ట్ చేస్తున్న మోడీ.. యువత ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమయాన్ని ఎంచుకుని మరీ తన సందేశాలను రీల్స్ రూపంలో ఇన్స్టాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన రీల్స్ కు వ్యూయర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. చేనేతపై ఆయన షేర్ చేసిన రీల్ కూడా నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మోడీ ఇన్ట్సా వేదికగా యువతకు చేరువకావడానికి చేస్తున్న ప్రయత్నం వేనుక.. ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు ప్రభుత్వానికీ, యువతకు ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను ప్రస్ఫుటంగా బయట పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాప్ ను పూడ్చాలన్న లక్ష్యంతో మోడీ ఇన్ట్సా వంటి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియోలు వేగంగా, ప్రభావమంతంగా యువతకు చేరువవుతాయన్న భావనతోనే.. ప్రధాని ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను వివరిస్తూ యువతకు చేరువకావడానికి ఇన్స్టా వంటి వేదికలను ఎంచుకున్నారంటున్నారు. ముఖాముఖిగా మాట్లాడేందుకు డిజిటల్ వేదికలను వాడుకోవడం పెంచారు. ఇటీవలి కాలంలో మెడీ విద్యార్థుల సమస్యలు, వివిధ అంశాలపై విడేదల ,చేసిన సెల్ఫీ వీడియోలు, రీల్స్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. Narendra Modi Instagram Reels, PM Modi Handloom Campaign, PM Modi Gen Z Outreach, PM Modi Social Media Strategy, TeluguOne,
Modi Handloom Sector Reel
http://www.teluguone.com/news/content/narendra-modi-instagram-reels-36-228233.html





