త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..?

Publish Date:Apr 21, 2026

Advertisement

 

త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. గ్యాస్ ధరలపై స్పష్టత లేకపోయినా.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రం తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆ భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరిస్తూ వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తయ్యగానే ధరల పెంపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, కాల్పుల విరమణ ప్రయత్నాలు, హర్మూజ్ జలసంధి మూసివేత–తెరవడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్రంగా మార్పులకు లోనవుతున్నాయి. 

ఒక దశలో బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరగా.. ఆ తర్వాత 80 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 90 నుంచి 100 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. భారత్ దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుండటంతో ఈ ధరల మార్పులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలపై భారం పెరుగుతోంది. ప్రజలపై ఈ భారం మోపకుండా ప్రభుత్వం కొంతవరకు ట్యాక్స్‌లు తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ.. కంపెనీల నష్టాలు కొనసాగుతున్నాయి.

ఈ భారం తగ్గించేందుకు ఇప్పటికే స్పీడ్, పవర్ పెట్రోల్‌పై లీటరుకు 2 రూపాయలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం అలాగే ఉంచాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయ్యింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.

ఎంత మేర పెరుగుతాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం బ్యారెల్ చమురు ధర 95 డాలర్ల వద్ద ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు 8 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చు. అదే ధర 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటే 3 నుంచి 7 రూపాయల వరకు పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. మన దేశంలో దాదాపు 70 శాతం సరుకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. ట్రక్కులపై ఆధారపడే ఈ వ్యవస్థలో డీజిల్ ధరలు పెరిగితే.. నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రక్కులకు డీజిల్ సరఫరాపై అనధికారిక పరిమితులు విధిస్తున్నట్లు సమాచారం. సప్లై తగ్గిందన్న కారణంతో ఒక్కో ట్రక్‌కు పరిమిత పరిమాణంలోనే డీజిల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.ఇక ధరల పెంపు ప్రచారంపై ట్రక్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు లీటరుకు 15 రూపాయల వరకు పెరిగితే రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని, 30 శాతం వరకు ట్రక్కులు నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

గత దశాబ్దాన్ని పరిశీలిస్తే.. 2013లో లీటర్ పెట్రోల్ ధర 72 రూపాయలు ఉండగా.. 2015-16 మధ్య 60 నుంచి 66 రూపాయలకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ 2020 నాటికి 80 నుంచి 95 రూపాయలకు చేరింది. 2022-24 మధ్య 97 రూపాయల వరకు పెరిగిన ధరలు.. ప్రస్తుతం 100 రూపాయల దాటాయి. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎక్కడికి చేరతాయన్నది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.


 

By
en-us Political News

  
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.