పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్‌లో చికిత్స..!

Publish Date:Jul 28, 2026

Advertisement

 

స్పందించని నాడీ వ్యవస్థ.. ఆరోగ్యం విషమం..!

వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (54) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

45 నిమిషాల పాటు ఆగిన గుండె స్పందన..!


ముందుగా వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల తీవ్ర బీపీ పడిపోయి హార్ట్ ఎటాక్ (హెమోడైనమిక్ కొలాప్స్) వచ్చింది. అక్కడ వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR), ఏసీఎల్ఎస్ (ACLS) పద్ధతుల్లో అత్యవసర వైద్యం అందించి గుండె స్పందనను పునరుద్ధరించారు. అనంతరం అక్కడ ప్రాథమిక చికిత్స (త్రాంబోలైసిస్) పూర్తి చేసి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.

నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం..!


యశోద ఆసుపత్రిలో క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందిస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, బీపీ అందుబాటులో ఉన్నప్పటికీ, 45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ఈఈజీ (EEG), ఎంఆర్‌ఐ (MRI), టీసీడీ (TCD) పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే నష్టం (Anoxic Damage) జరిగినట్లు గుర్తించారు.

శబ్దాలకు, స్పర్శకు ఆయన ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని వైద్యులు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం (రేపు) 72 గంటల న్యూరో అసెస్‌మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

Peddi Sudarshan Reddy Health Bulletin released, Health Bulletin Release, Yashoda Hospital, Treatment in Advanced Critical Care, KCR, KTR, BRS Party

By
en-us Political News

  
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!
హైదరాబాద్‌లోని గచ్చి బౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..!
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.