పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. !

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురికావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, గుండె సంబంధిత సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. వైద్యుల అంచనా ప్రకారం ఆయనకు గుండె రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారని, పరిస్థితిని బట్టి స్టెంట్ అమర్చడం లేదా బైపాస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి అత్యవసరంగా అంబులెన్స్‌లో తరలించే నిర్ణయం తీసుకున్నారు.

రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించగా, హనుమ కొండ నుంచి హైదరాబాద్ వరకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌కు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు మార్గమంతా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వేగంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. దీంతో సుమారు గంటన్నర వ్యవధిలోనే ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కార్లలో అనుసరిస్తూ పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జిల్లా నాయకులతో నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతూ వైద్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు ప్రత్యేకంగా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యులు కూడా ఎప్పటి కప్పుడు చికిత్స పురోగతి ని కేసీఆర్‌కు వివరిస్తు న్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో నిపుణుల బృందం ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Peddi Sudarshan Reddy Health, BRS Former MLA Sudarshan Reddy, Heart Attack Hanamkonda, Rohini Hospital Warangal, Telangana BRS News, Secunderabad Yashoda, Harish Rao

By
en-us Political News

  
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ ప్రాంత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బంగారు బోనాన్ని సమర్పించారు.
ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమయ్యే దిశగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి.
సినీ పరిశ్రమలో తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
కేంద్ర విద్యాశాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.