Publish Date:Jun 25, 2026
ఇండియన్ పాస్ పోర్టు ఉన్నంత మాత్రాన ఇండియన్ సిటిజన్ అయిపోయినట్లు కాదని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా పేర్కొంది. ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమే కానీ.. అదే సిటిజన్ షిప్ ను రుజువు కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిఫై చేసింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ మేరకు అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ నుండి ఎవరైనా తొలగించబడితే, వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను ఆధారంగా చూపించవచ్చా అన్న ప్రశ్నకు ఆయనీ బదులిచ్చారు. చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో జాతీయతను సూచిస్తుందే తప్ప, అది భారతదేశ పౌరసత్వ పత్రం కాదని కుండబద్దలు కొట్టారు.
కేంద్రం ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నాయకుడు ఆదిత్య థాకరే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ పత్రం కానప్పుడు.. దానిని ఒక సాధారణ పౌరుడికి జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు అన్ని రకాల వెరిఫికేషన్లు చేస్తారని నిలదీశారు. నాన్ ఇండియన్స్ కూడా పాస్‌పోర్ట్‌లను ట్రావెల్ డాక్యుమెంట్లుగా కేంద్రం ఇస్తుందా అని నిలదీశారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఇండియన్ పాస్‌పోర్ట్ చట్టబద్ధత పై తీవ్ర అనుమానాలు రేకెత్తించేలా ఉందని సామాజిక మాధ్యమ వేదికలో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గతంలో సుప్రీం కోర్టుతోపాటు పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం.. భారతదేశంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ కూడా పౌరసత్వానికి తిరుగులేని చట్టపరమైన ఆధారాలు కావు. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి గుర్తింపు, నివాస ధ్రువీకరణ కు మాత్రమే పనికొస్తాయి. విదేశాల నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్‌షిప్ సర్టిఫికెట్' జారీ చేస్తుంది. కానీ దేశంలోనే పుట్టి పెరిగిన ఇండియన్స్ కుఅలాంటి పౌరసత్వ పత్రం ఏదీ ఉండదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చేసిన ఈ తాజా ప్రకటన ప్రజల్లో తీవ్ర గందరగొళానికీ, చర్చకూ దారి తీసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/passport-is-not-proof-of-citizenship-36-224067.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.