నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర తెలుసా? ఆ డబ్బుతో లైఫ్ సెట్ చేసుకోవచ్చు!
Publish Date:Jul 8, 2026
Advertisement
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అంటే కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్. ఆమె ధరించే దుస్తులు, చేతికి పెట్టుకునే వాచీలు, ఉపయోగించే హ్యాండ్‌బ్యాగుల విలువ వింటేనే సామాన్యుల గుండె గుభేల్ అంటుంది. కొద్ది నెలల క్రితం ఆమె వైట్ గోల్డ్, అత్యంత ఖరీదైన వజ్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన 'హెర్మెస్ కెల్లీమార్ఫోస్' బ్యాగును కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ విలాసవంతమైన బ్యాగు విలువ అక్షరాలా రూ.15 కోట్లు అని సమాచారం. లగ్జరీ వస్తువులపైనే కాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్యా రంగాల్లో లక్షలాది మందికి ఆమె సేవలు కూడా అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. నీతా అంబానీ నిత్యం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించడానికి ఆమె తాగే ప్రత్యేకమైన నీళ్లే కారణమంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. ఆమె తాగే ఒక వాటర్ బాటిల్ ఖరీదు ఏకంగా రూ.49 లక్షలు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నీటి బాటిల్‌ను 'అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మోడిగ్లియాని' అని పిలుస్తారట. ఇంత భారీ ధర ఉండటానికి కారణం ఆ బాటిల్ డిజైన్ మరియు అందులోని నీటి ప్రత్యేకతలే. ఈ బాటిల్‌ను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేస్తారని, అందుకే దీనికి అంత అంతర్జాతీయ విలువ ఉందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఈ బాటిల్‌లోని నీటిలో కేవలం దాహం తీర్చే గుణం మాత్రమే కాకుండా, శరీరానికి అమితమైన శక్తిని, చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు ఉంటాయని అంటారు. ఇందులో ఫ్రాన్స్ లేదా ఐస్లాండ్ వంటి దేశాల సహజ సిద్ధమైన స్ప్రింగ్ వాటర్స్ ఉంటాయని, దానికి తోడు 5 గ్రాముల బంగారు భస్మం (గోల్డ్ యాష్) కలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ బంగారు కణాలు శరీరంలో యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తాయని నమ్ముతారు. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన జీవితాంతం బతకడానికి అవసరమయ్యే డబ్బు, నీతా అంబానీ తాగే ఒక్క వాటర్ బాటిల్ రూపంలో ఉంటుందనేసరికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అయితే, ఈ ₹49 లక్షల వాటర్ బాటిల్ వార్తలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. నీతా అంబానీ నిజంగానే ఈ బాటిల్ వాడుతున్నారా లేదా అనేది కేవలం ఒక సోషల్ మీడియా టాక్ మాత్రమే. అయినప్పటికీ, అంబానీ కుటుంబానికి ఉన్న సంపద, వారి జీవన శైలిని చూసే జనాలు ఈ వార్తలను ఇట్టే నమ్మేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వస్తువులను సొంతం చేసుకునే నీతా అంబానీ బ్రాండ్ వాల్యూకు ఈ వార్తలు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/nita-ambani-water-bottle-cost-details-36-225412.html





