హైదరాబాద్‌లో ఇక నైట్‌ బస్సులు.. 6 మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బస్సు సర్వీసులు తగ్గిపోవడం, 11 గంటల తర్వాత మెట్రో సేవలు నిలిచిపోవడంతో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలు, ప్రైవేట్‌ క్యాబ్‌లను ఆశ్రయించాల్సి రావడంతో అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రత్యేక నైట్‌ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సేవలను ప్రతిరోజూ నిరంతరాయంగా నిర్వహించనున్నారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు తొలి దశలో 30 ప్రత్యేక బస్సులను 6 ప్రధాన మార్గాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాత్రివేళ విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ఐటీ–బీపీఓ సిబ్బంది, దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. మేడ్చల్‌ నుంచి గచ్చిబౌలికి 195 నంబర్‌ బస్సు, కొండాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 10H బస్సు, కోఠి నుంచి పటాన్‌చెరుకు 218, మరో మార్గంలో 222A బస్సులు అందుబాటులో ఉంటాయి. హయత్‌నగర్‌ నుంచి జేబీఎస్‌కు 290U బస్సు, సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరుకు 219 నంబర్‌ బస్సు రాత్రివేళల్లో సేవలు అందించనున్నాయి. రాత్రి వేళల్లో ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. 

దీంతో అధిక చార్జీలతో పాటు భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నైట్‌ బస్సుల అందుబాటుతో ఈ సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది. అత్యవసర రాత్రి ప్రయాణాలకు ప్రజా రవాణా మరింత అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఆరు ప్రధాన మార్గాల్లో ప్రారంభించిన నైట్‌ బస్సులకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, ఆక్యుపెన్సీని అధికారులు పరిశీలించనున్నారు. డిమాండ్‌ పెరిగితే రానున్న రోజుల్లో మరిన్ని మార్గాలకు నైట్‌ బస్సు సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. దీంతో రాత్రివేళల్లో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు నగర ప్రజా రవాణా మరింత ఉపయోగకరంగా మారనుంది.

Night buses in Hyderabad, Night shift employees, TG RTC, Occupancy, Kondapur, Koti, Secunderabad

By
en-us Political News

  
ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఎల్‌ఐసీ ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. పేమెంట్ గేట్‌వే ఛార్జీల వివాదమే దీనికి కారణమా పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.