కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతుల ఆత్మహత్య
Publish Date:May 2, 2026
Advertisement
కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైద రాబాద్ నగరంలో జరిగింది. 28 ఏళ్ల కార్తీక్ , 27 ఏళ్ల మంజులకు ఈ ఏడాది ఏడాది మార్చి 8న వివాహమైంది. వీరు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు. దీంతో స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహం జరిగిన రెండు నెలలకే ఈ నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. నవ దంప తులు ఆత్మహత్య చేసుకో వడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/newlyweds-commit-suicide-36-218799.html





