యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

భయంతో యువకుడి సుసైడ్..!

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో, ఎన్నో అవధులు లేని ఆశలతో డాక్టర్ చదువుతున్న ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ప్రేమోన్మాదానికి బలవ్వగా, ఆమె మృతికి కారణమైన ఇరవై రెండు ఏళ్ల చిలుముల రామ్ చరణ్ అనే యువకుడు కూడా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కన్నవారి కలలను నిజం చేస్తూ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం తన స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. అయితే, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు రామ్ చరణ్‌ను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ ఘోరాన్ని గమనించి కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయానికి నిందితుడు రామ్ చరణ్ కూడా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అయిన 'చిన్నారి' అనే పేరును రాసి, పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

 శుక్రవారం సాయంత్రం రామ్ చరణ్ మరో వ్యక్తితో కలిసి లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్తుండటంతో, యువతి మృతి వెనుక హత్య కోణం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. ఈ ఘటనపై శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda MBBS student suicide, Lakshmi Prasanna medical student death, Kattangur Munukuntla news, Ram Charan suicide Nalgonda, Suryapet medical college student, Telangana crime updates, CM Revanth reddy, Telangana goverment

By
en-us Political News

  
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.