బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసుల కళ్లల్లో కారం చల్లిన రైతులు.!

Publish Date:Jul 18, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడ భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గత ఐదు రోజులుగా ప్రభుత్వ భూముల అంశంపై రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా, శనివారం(జులై 18) పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావర ణాన్ని తలపించింది. శనివారం (జులై 18)  ఉదయం రైతుల తో మాట్లాడిన ఆర్డీఓ శ్రీధర్, వివాదాస్పదంగా ఉన్న 650 ఎకరాలు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు. ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టా భూములుగా మారవని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే సుమారు 400 ఎకరాలు ఇతరులకు విక్రయించా రని.. ప్రస్తుతం బయటి వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. 

అయితే మిగిలిన భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. అయితే అధికారులు చర్చలు కొనసాగుతుండగానే ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది జేసీబీలతో పనులు ప్రారంభించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పనులను అడ్డుకు నేందుకు ప్రయత్నించగా..  పోలీసులు వారిని నిలువరించే క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసు కుంది. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులు పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరినట్లు సమాచారం. అంతేకా కుండా కొందరు రైతులు పోలీసుల కళ్లలో కారం చల్లడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటనలో శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు సీఐలు గాయప డ్డారు.  

ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో   భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.  మరోవైపు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.