అల్లుడి దాడిలో అత్త మృతి

Publish Date:May 2, 2026

Advertisement

   అల్లుcడిదాడిలో అత్త మృతి చెందిన సంఘటన మేడ్చెల్ జిల్లాలో జరిగింది.   ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముం టున్న కల్లా కావ్య,  స్నేహిత్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీ కారంతో  ఏడాది క్రితం వీరికి వివాహం జరిగింది. వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. 
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది. 

ఆరోజు రాత్రి సమయంలో స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తన పై అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అత్త అరుణ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29 మధ్యాహ్నం సమయంలో అత్త అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతున్న సమయంలో... అక్కడికి వచ్చిన అల్లుడు స్నేహిత్ అత్త అరుణతో గొడవపడడమే కాకుండా బలవం తంగా ఆమెను బైక్ పై ఎక్కించుకొని తీసుకువె ళ్లాడు. 

కొద్దిసేపటి తర్వాత స్నేహిత్ తన భార్య కావ్య కు ఫోన్ చేసి అత్త అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుండి కింద పడిందని తెలిపాడు. దీంతో అరుణను మొదటగా సమీపంలోని మెడి స్టార్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్బీఎం హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనపై కావ్య కు   అనుమానం వచ్చి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. భర్త స్నేహిత్ బైక్పై వెళ్తున్న సమయంలో తన తల్లి అరుణతో వాగ్వివాదానికి దిగాడు.  అనంతరం స్నేహిత్ వెనుక కూర్చున్న అత్త అరుణ తలపై హెల్మెట్తో గట్టిగా బాదాడు. దీంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుండి అత్త అరుణ రోడ్డుపై పడిపోయినట్లుగా సీపీ ఫుటేజీలో స్పష్టంగా ఉంది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయప డిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30  సాయంత్రం సమ యంలో మృతి చెందింది. కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ను ఆధా రంగా చేసుకుని నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.