సామాజిక ఓట్లపై సుబ్బిరామిరెడ్డి కన్ను!
Publish Date:May 24, 2012
Advertisement
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సామాజిక ఓట్లను సాధించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. సహజంగా తనకున్న సినీ అనుభవాలు, రాజకీయానుభావాలు దృష్టిలో ఉంచుకుని ఆయన పావులు కదుపుతున్నారు. టిక్కెట్టు అధికారికంగా ప్రకటించక ముందే ఈ నియోజకవర్గంలో కాలుమోపకుండానే కులాల వారీగా ఓటర్ల వివరాలను సుబ్బిరామిరెడ్డి తెప్పించుకున్నారు. ముందుగా జనాభాలో విద్యావంతులను గెలుచుకుని తరువాత మాస్ క్యాంపెయిన్ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్న సుబ్బిరామిరెడ్డి దాని ప్రకారం కులసంఘాలను,. సామాజికసేవలో ఉండే యువజన సంఘాలను, సంక్షేమ సంఘాలను ఒకేసారి పిలిపించి విడివిడిగా వారి సహాయం అర్థించారు. దీంతో ఆగకుండా తన ప్రచారంలో ఏ సంఘ కార్యాలయం ఉన్నా దానిలో ఉన్న కార్యవర్గాన్ని కలిసి ఉత్సాహపరుస్తున్నారు. ఈ లోక్ సభ స్థానంలో సుమారు 14లక్షల 50వేల 939 (2009 పోలింగ్ ప్రకారం) ఓటర్లున్నారు. తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డికి గత ఎన్నికల్లో 4,30,235 ఓట్లు వచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల రెడ్డికి 3,75,242 ఓట్లు వచ్చాయి. ఇలాంటి గణాంకాలతో సహా అన్ని వివరాలు సంపాదించిన సుబ్బిరామిరెడ్డి ఇటీవల ముస్లీం వేషధారణలో నియోజకవర్గంలోని ముస్లీం సోదరుల కోసం చేస్తున్న కార్యక్రమాలను ఆయన ఫక్తు ఉర్దూలో వివరించి వారి మనస్సు గెలుచుకున్నారు. ముస్లీం సోదరులు చివరగా సుబ్బిరామిరెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇలా సామాజిక ఓట్లతో గెలుపుబాట వేసుకునేందుకు సుబ్బిరామిరెడ్డి కృషి చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nellore-lok-sabha-candidate-tsubbirami-reddy-24-14268.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





