శాసిస్తున్న జగన్ ... అమలు చేస్తున్న ద్వారంపూడి ...
Publish Date:May 24, 2012
Advertisement
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎలా చెబితే అలా ... ఆయన శాసనాలను యథాతథంగా అమలు చేసే కుటుంబం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిది. అందుకే జగన్ చెప్పినట్లు ముందుగా తన అన్న ద్వారంపూడి వీరభద్రారెడ్డిని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి పంపించి తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఎటువంటి భావనలూ ఉండకూడదనటానికి ఎమ్మెల్యే ద్వారంపూడి ఓ గీటురాయిగా నిలుస్తున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కుటుంబానికి సంబందాలున్నాయి. వ్యాపారం నష్టాల్లో ఉండి దారుణమైన స్థితికి దిగాజారిపోవాల్సిన సమయంలో వై.ఎస్.ఆర్. కుటుంబం ద్వారంపూడి కుటుంబాన్ని ఆదుకుంది. అందుకే కొంతకాలం బహిరంగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డితో కలిసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తిరిగిన ఎమ్మెల్యే ద్వారంపూడి అవిశ్వాసం సమయంలో జగన్ ను తిరిగి సలహా కోరారని తెలిసింది. ఆయన ఇచ్చిన సలహా మేరకే కాంగ్రెస్ లోనే ద్వారంపూడి కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్నీ పత్రికాముఖంగా ప్రకటించి మరీ చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ శ్రేణులపై పట్టుపెంచుకుంటున్నారు. మొదట్లో గ్రూపుల వారీగా తనకు ఉపయోగపడేవారినే చేరదీసిన ఎమ్మెల్యే ఇప్పుడు తనకు అవసరమున్నా లేకున్నా అందరినీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన్ని కాంగ్రెస్ శ్రేణులు నమ్మటం లేదు. ఎందుకంటే తమ కళ్ళముందే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తిరిగి తరువాత కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని ప్రకటించటం కార్యకర్తలకు నచ్చటం లేదు. దీంతో ఎవరు ఏమి అడిగితే అది చేసే ధోరణికి చంద్రశేఖరరెడ్డి వచ్చారు. ఇది ఒకవైపు అయితే నాణేనికి మరోవైపు ఓ చిత్రమైన ప్రణాళికను జగన్ రూపొందించారు. దాని ప్రకారం 2014 ఎన్నికలప్పటికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఫుల్ ఫామ్ లో ఉంటే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆయన అన్న వీరభద్రారెడ్డి స్వాగతం పలుకుతారు. అదే కనుక ఫామ్ లో లేకపోతే కాంగ్రెస్ తరపున చంద్రశేఖరరెడ్డి తిరిగి టిక్కెట్టు సంపాదించుకోవచ్చు అని జగన్ ఆప్షన్ తో సూచనలిచ్చారట. దాన్ని తూ.ఛ (తుది చరణం) తప్పకుండా ఫాలో అయిపోవాలని ద్వారంపూడి సిద్ధమయ్యారు. కానీ, కాకినాడ నియోజకవర్గంలో చంద్రశేఖరరెడ్డి అంతే వ్యతిరేకత కూడా పెరిగిపోయింది. ఎమ్మెల్యే అయిన తొలినాళ్ళలో చౌకదుకాణాల కేటాయింపు వ్యవహారం వచ్చినప్పుడు మన రెడ్లు పేర్లేమైనా ఉంటే దానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బయటపడటం వల్ల ధరఖాటుదారులు హతాశులై ఈ విషయాన్ని నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. దీంతో ఎమ్మెల్యే తన సామాజిక కులానికి ఇచ్చే ప్రాధాన్యత, జగన్ మాటకు ఇచ్చే విలువ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు. ఏ పాన్ షాపు దగ్గర ఆగినా ఎమ్మెల్యే జగన్ మనిషేనట కదా! అన్న కాహ్ర్చ ఇటీవల కాలంలో ఎక్కువైంది.
http://www.teluguone.com/news/content/jagan-orders-and-dwarampoodi-does-24-14267.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





