నీరుగారిపోతున్న ఎన్నికల ఉల్లంఘన కేసులు?
Publish Date:May 24, 2012
Advertisement
ఎన్నికల్లో నేరాలు, నిబంధనలు అతిక్రమించిన నేరానికి ఇప్పటివరకూ ఎటువంటి కఠినశిక్ష నిందుతులకు పడ్డ దాఖలాలు లేవు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ ఉప ఎన్నికల్లో నేరాల కింద పోలీసులు ఫైల్ చేసిన కేసుకు తక్కువే. కానీ, ఆ కేసులు ప్రముఖులపై పెట్టడం ఎన్నికల అధికారుల చట్టబద్ధమైన కర్తవ్యంలా కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పార్టీల కేంద్రకమితీలు, అధికారంలో ఉన్న పార్టీ సూచనల మేరకు ఈ కేసులు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా కొట్టివేతకు గురవుతాయని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల కమీషన్ తన పదును పెంచి మరీ కులప్రస్తావన చేసే అభ్యర్థులనూ వదలబోమని హెచ్చరించింది. ఈ హెచ్చరిక జారీ చేయటానికి మునుపే దీనికి ఓ స్థాయి కల్పించేలా మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా క్రిష్టియనేనని చేసిన వ్యాఖ్యను రికార్డుచేయమని శ్రీకాకుళం కలెక్టరును ఆదేశించింది. అలానే జగన్ రోడ్డుషోలో మద్యం పంపిణీని కూడా ఓటరును ప్రలోభపెట్టే అంశంగా కేసు నమోదు చేయించింది. గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై అనుమతి లేని ప్రచారం కేసు నమోదైంది. ఇదే విధంగా మొట్టమొదట తిరుపతిలో టెలికాం ఉద్యోగుల సహకారం కోరిన దేశం అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి, మాజీ మంత్రి చింతామోహన్ టిటిడి పాలకమండలి కార్యాలయ ఉద్యోగులను అభ్యర్తించటం కూడా ఎన్నికల కమీషన్ రికార్డు చేసింది. తాజాగా టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు చంద్రశేఖరరావు పరకాలలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్నికల కమీషన్ రికార్డు చేయించింది. ఇలా ప్రముఖులందరూ ఎన్నికల నిబంధనావళి అతిక్రమణ నేరాల్లో చిక్కుకున్నారు. వీరందరికీ ఈ కేసుల్లో శిక్షపడుతుందా? అన్న ప్రశ్న సామాన్య ఓటరు నుంచి ఎదురవుతోంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న స్పీడుగా ఎన్నికల కమీషన్ శిక్షలు వేయించగలిగితే ఎన్నికల అక్రమాలు కొంతవరకైనా తగ్గవచ్చు. అయితే డబ్బుతో ప్రలోభ పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ అడిరి పోతోందని లెక్కలే చెబుతున్నాయి. భారతదేశ జనాభాతో సమానమైన కోట్లాది రూపాయలు చెక్ పోస్టుల తనిఖీల ద్వారా రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దగ్గరపడకుండానే ఇప్పటికే 25కోట్ల రూపాయల వరకూ లెక్కల్లో లేని సొమ్ము ఆదాయపన్ను శాఖకు పోలీసుల ద్వారా చేరింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళమండలం ఏలూరుపాడు చెక్ పోస్టు తనిఖీలో బ్యాంకుదని చెబుతూ లేక్కచూపని రూ. 2.35 కోట్లు ఇదే బాపతు కింద పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదాయపన్నుశాఖకు అప్పగించారు. ఈ కేసులు బలంగా పెట్టినా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భయపడతారని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/election-rules-cases-24-14269.html





