జింబాబ్వేతో టి20 సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా.!

Publish Date:Jul 26, 2026

Advertisement

జింబాబ్వేతో జరిగిన మూడు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆదివారం(జులై 26)  జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా  35 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో యంగ్ ఇండియా చూపించిన దూకుడు, సమష్టి ప్రదర్శన టీమిండియా భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది. తుది మ్యాచ్‌లో ప్రదర్శించిన ఆల్ రౌండ్ నైపుణ్యం మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే   ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు.  అయితే మరో ఓపెనర్,  యువ సంచలనం, బేబీ బాస్  వైభవ్ సూర్యవంశీ  ఆట స్వరూపాన్నే మార్చివేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా  విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4  సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ 29 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్  14 బంతుల్లోనే పాతిక  పరుగులు రాబట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల స్కోరు చేసింది.  

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఓపెనర్  బెన్నెట్‌ వికెట్ కోల్పోయింది.  మయాంక్ యాదవ్ ఈ వికెట్ పడగొట్టాడు.  అనంతరం యశ్ ఠాకూర్ ఒకే ఓవర్లో  డియాన్ మైయర్స్ (19),  కెప్టెన్ సికిందర్ రజా (0) లను ఔట్ చేయడంత జింబాబ్వే ఇక కోలుకోలేకపోయింది.  అయితే ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. జింబాబ్వే ఆల్ రౌండర్ రియాన్ బర్ల్ ఒంటరి పోరాటం చేశాడు. బర్ల్ 43 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే అతడి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది తప్ప జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది.   

ndia vs Zimbabwe T20, India Clean Sweep, Vaibhav Suryavanshi 81, Mayank Yadav Bowling, IND vs ZIM 3rd T20, Harare Sports Club
 

By
en-us Political News

  
హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! 
సీఎంను కలిసి మూడు రోజులకే గిరిజన విద్యార్థిని సుసైడ్..!
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.