జలవిలయం: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష!

Publish Date:Aug 28, 2026

Advertisement

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్వమౌతున్నది.  నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ పర్యాటకుల  క్షేమ సమాచారాలపై మంత్రి నారా లోకేష్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మానససరోవర యాత్రతో పాటు ఆధ్యాత్మిక సందర్శన కోసం నేపాల్   వెళ్లిన మన రాష్ట్రానికి చెందిన పర్యాటకుల  పరిస్థితిపై ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడి  వివరాలను తెలుసుకున్నారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న యాత్రికుల భద్రతను నిర్ధారించడంతో పాటు, వారికి అవసరమైన  సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు మంత్రి లోకేష్. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రతినిధులు అందించిన   నివేదికల ప్రకారం..  నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం ఏడుగురు ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో ముగ్గురు యాత్రికులు  సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.  ప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ యాత్రా బృందానికి చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మిల ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. 

గల్లంతైన ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరగా చైనా సరిహద్దు సమీపంలోని గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్నట్లు సమాచారం ఉందని అధికారులు వివరించారు.గల్లంతైన  ముగ్గురు యాత్రికులను   గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రంతో  నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. చైనా, నేపాల్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, గైరోంగ్ చెక్‌పోస్ట్ అధికారులతో పాటు ఈషా ఫౌండేషన్ నిర్వాహకులతో   సమన్వయం చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం సురక్షితంగా ఉన్న యాత్రికులకు అవసరమైన వైద్యం, ఆహారం, తాత్కాలిక ఆవాస సదుపాయాలు కల్పించి, వారిని సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని  మంత్రి ఆదేశించారు. మంత్రి లోకేష్ మార్గదర్శకాల మేరకు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, యాత్రికుల స్థితిగతులను  ట్రాక్ చేస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర విదేశాంగ శాఖ సహాయంతో సహాయక చర్యలు వేగవంతం చేశామని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. 

 

(Nara Lokesh Review on Nepal Floods,  AP Pilgrims, Mansarovar Yatra,  AP Devotees, AP Delhi Bhavan Rescue, RTGS AP Nepal Rescue)
 

By
en-us Political News

  
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.