మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫికేషన్ సీక్రెట్: కేటగిరీ వేరైనా స్టాక్స్ ఒకటేనా?

Publish Date:Jul 27, 2026

Advertisement

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తగ్గించుకోవడానికి చాలామంది ఇన్వెస్టర్లు ఎంచుకునే ప్రధాన మార్గం డైవర్సిఫికేషన్. ఇందుకోసం వేర్వేరు కేటగిరీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్, అంటే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ & మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ ఫండ్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వేర్వేరు పేర్లు, విభిన్న కేటగిరీలు ఉన్న ఫండ్లలో పెట్టుబడి పెడితే తమ పోర్ట్‌ఫోలియో సురక్షితంగా డైవర్సిఫై అవుతుందని, వేర్వేరు కంపెనీల స్టాక్స్ లభిస్తాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అయితే, వ్యాల్యూ రీసెర్చ్ నిర్వహించిన ఒక తాజా విశ్లేషణ ఇన్వెస్టర్లకు కన్నువిప్పు కలిగించే దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టింది. మీరు వేర్వేరు కేటగిరీలకు చెందిన ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ, అవి అంతర్గతంగా ఒకే రకమైన స్టాక్లలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. దీనివల్ల డైవర్సిఫికేషన్ దేవుడు ఎరుగు, ఒకే రకమైన రిస్క్‌కు ఇన్వెస్టర్లు గురవుతున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన BOI లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ మరియు BOI మల్టీ క్యాప్ ఫండ్ల మధ్య ఏకంగా 79.4 శాతం పోర్ట్‌ఫోలియో ఓవర్‌లాప్ ఉంది. అంటే ఈ రెండు ఫండ్లు వేర్వేరు కేటగిరీలకు చెందినవి అయినప్పటికీ, వాటిలో దాదాపు 80 శాతం స్టాక్స్ ఒకే రకంగా ఉన్నాయి. కేవలం ఒకే మ్యూచువల్ ఫండ్ హౌస్ మాత్రమే కాదు, పరిశ్రమలోని అనేక ప్రముఖ ఫండ్ హౌస్‌లలోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఉదాహరణకు కెనరా రోబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మరియు కెనరా రోబెకో లార్జ్ క్యాప్ ఫండ్ల మధ్య 74.9 శాతం ఓవర్‌లాప్ ఉండగా, హెలియోస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మరియు హెలియోస్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ల మధ్య 74.3 శాతం పోర్ట్‌ఫోలియో ఓవర్‌లాప్ నమోదైంది. అలాగే బరోడా బిఎన్‌పి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మరియు బరోడా బిఎన్‌పి లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ మధ్య 74.2 శాతం, జియోబ్లాక్‌రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మరియు జియోబ్లాక్‌రాక్ లార్జ్ క్యాప్ ఫండ్ల మధ్య 70.9 శాతం, యాక్సిస్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ మరియు యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్ మధ్య 68.4 శాతం పోర్ట్‌ఫోలియో పోలికలు ఉన్నాయి.

సెబీ నిబంధనల ప్రకారం ప్రతీ ఫండ్ కేటగిరీకి ప్రత్యేక విధివిధానాలు, పెట్టుబడి నిబంధనలు ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు ఎలాంటి పరిమితులు లేకుండా లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయవచ్చు. లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్లు లార్జ్ క్యాప్ లలో కనీసం 35 శాతం, మిడ్ క్యాప్ లలో కనీసం 35 శాతం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మల్టీ క్యాప్ ఫండ్లు లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ లలో కనీసం 25 శాతం చొప్పున కేటాయించాలి. అయితే మిగిలిన శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ ఇష్టానుసారంగా కేటాయించే అవకాశం ఉండటంతో, వేర్వేరు కేటగిరీల ఫండ్లు కూడా మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఒకే రకమైన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల స్టాక్లను కొనుగోలు చేస్తున్నాయి.

different fund categories same stocks overlap,equity mutual fund portfolio overlap study
 

By
en-us Political News

  
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.