తెలుగుదేశం సీనియర్ నాయకుడు వల్లభనేని బాబూరావు కన్నుమూత
Publish Date:May 2, 2026
Advertisement
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వల్లభనేని బాబు రావు శనివారం ( (మే 2) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబు రావు గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడేవారు. పార్టీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కోసం సర్వం ఒడ్డి పని చేశారు. వల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాబురావు అంత్యక్రియలకుపెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్థానిక నేతలు స్మరించుకుంటున్నారు. ఒక క్రమశిక్షణ గల నాయకుడిని కోల్పోవడంతో గన్నవరం టీడీపీలో ఒక శకం ముగిసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని స్థానిక నాయకత్వం పేర్కొంది.
http://www.teluguone.com/news/content/tdp-senior-leader-vallabhaneni-36-218802.html





