ఉప ఎన్నికల్లో వరదలై పారుతున్న డబ్బు
Publish Date:May 17, 2012
Advertisement
రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నా నియోజకవర్గాల్లో డబ్బు వరదలై పారుతోంది. ఎన్నికలు జరుగబోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతీ చెక్ పోస్టు వద్ద ఎంతో కొంత నగదు దొరుకుతోంది. లెక్కలు చూపని డబ్బు వివరాలను మాత్రమే మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. దానిని ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తున్నారు. ఇలా పోలీసులు ఇప్పటివరకూ పట్టుకున్నదే సుమారు మూడు కోట్లు ఉంటుందని హైదరాబాద్ లోని ఓ పోలీసు అధికారి తెలిపారు. బ్యాంకులో జమ చేయటానికి తీసుకువెళుతున్నామని చెప్పి బుకాయించే నిందుతులు వాటికి లెక్కలు చూపటం లేదు. దీంతో ఆ డబ్బును ఎన్నికల అవసరాలకోసం ఉపయోగించ రన్న గ్యారెంటీ లేదు. కాబట్టి ఆధారాలు చూపటానికి సమయమిచ్చినా ఆ తరువాత పోలీసులు ఆదాయపన్ను శాఖ అజమాయిషీకి అప్పగించేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ చెక్ పోస్టును పటిష్టంగా నడిపితే ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయంగా సమకూరే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి ఒక్క అనంతపురం జిల్లాలోని మూడు చెక్ పోస్టుల్లో ఇప్పటికే లక్షలాది రూపాయలు దొరికాయి. ఒకదానికి మాత్రమే ఆధారాలున్నాయని ఐటిశాఖ ధ్రువీకరించింది. ఇటీవల తిరుపతి బస్ స్టాప్ లో 75 లక్షల రూపాయల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే చిత్తూరు జిల్లా రంగంపెతలో రూ 1.11కోట్లను పోలీసులు పట్టుకున్నారు. దీనికి ముందు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోనూ ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి.
http://www.teluguone.com/news/content/money-flow-in-bypolls-24-14103.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





