మోడీ..ఇంతలో ఎంత మార్పు... దటీజ్ చంద్రబాబు!

Publish Date:Jul 1, 2024

Advertisement

రాజకీయ వైరుధ్యంతో చంద్రబాబును ఇరుకున పెట్టి చోద్యం చూసిన వాళ్లే ఇప్పుడు ఆయన విజన్ కు దాసోహం అంటున్నారు. రాజకీయంగా సమస్యలు చుట్టుముట్టి ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని వారంతా ఇప్పుడు ఆయన మద్దతు కోసం తపిస్తున్నారు. 

ఇంతలో ఎంత మార్పు. అవమానించిన వాళ్లే ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతున్నారు. రాజకీయంగా అణిచివేయాలని వ్యూహాలు పన్నిన వారే ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో అదే జరిగింది. నెలల వ్యవధిలో జాతీయ రాజకీయాలలో ఆయన కేంద్ర బిందువుగా మారిపోయారు. అంతకు ముందు ఐదేళ్లు.. ఐదేళ్లనేమిటి? అంతకన్నా ఎక్కువ కాలమే ఆయనను  తక్కువ చేసి మాట్లాడిన వారు, తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆయన కరుణాకటాక్షాల కోసం అర్రులు చాస్తున్నారు. గతంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించిన వారే ఇప్పుడు చంద్రబాబును హీరోగా అభివర్ణిస్తున్నారు. 
కొన్ని నెలల కిందట జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులు ఆ అరెస్టును ఖండించలేదు. కనీసం ఆయనకు మద్దతుగా గళమెత్తలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకు మినహాయింపు అనుకోండి అది వేరే విషయం. 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 విపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని ఒక రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా అరెస్టు చేస్తే.. ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించలేదు. అక్రమ అరెస్టును ఖండించలేదు. తద్వారా జగన్ అరాచకత్వానికి పరోక్షంగా మద్దతు పలికారు. అంతకు ముందు.. అంటే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీలో పర్యటించిన నరేంద్ర మోడీ చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకుండా లోకేష్ కా బాప్ అంటూ అవమానకరంగా ప్రసంగాలు చేశారు. అయితే అదంతా గతం. ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఘన విజయం సాధించింది. అంతే కాదు.. ఎన్డీయే కూటమి మనుగడను శాసించగలిగేటన్ని స్థానాలను దక్కించుకుంది.  దీంతో ప్రధాని మోడీ ఒక్క సారిగా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఇవ్వక తప్పని పరిస్థితి ఆయనకు ఉంది. అందుకే గతంలో చంద్రబాబు పట్ల తాను వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోయి.. ఇప్పుడు బాబు భజన చేస్తున్నారు. 
గతంలో అంటే 2018 నుంచి ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కేంద్రాన్ని కోరారు, ఎన్డీయే భాగస్వామ్యపక్షం అయినప్పటికీ, అప్పట్లో మోడీ  చచంద్రబాబు వినతులకు పూచిక పుల్ల విలువ ఇవ్వలేదు. ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా కోరినప్పటికీ చంద్రబాబుకు కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. హస్తిన వేదికగా ధర్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.   
ఇప్పుడు రోజులు మారాయి. ఇక మోడీ ఎంత మాత్రం గతంలోలా చంద్రబాబును నిర్లక్ష్యం చేయలేరు.  నోరు తెరిచి అడగకుండానే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 
2024 ఎన్నికల ముందే మోడీకి జ్ణానోదయం అయ్యింది. దత్తపుత్రుడు జగన్ ను నమ్ముకుంటే.. ఆయనతో పాటు తానూ మునగక తప్పదన్న తత్వం బోధపడింది. అందుకే  తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యమయ్యింది.  అంతే కాదు ఇప్పుడు ప్రధానిగా తాను తీసుకునే విధాన నిర్ణయాలకు చంద్రబాబు ఆమోదమూ తప్పని సరి అయిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా మోడీ బాబును పొగడటానికే ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సభలలో  చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి తమ మధ్య అరమరకలు లేవని చాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సమావేశాలలో తన పక్కను చంద్రబాబు ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. చంద్రబాబు పక్కన నిలబడి ఫొటోలకు పోజులిస్తున్నారు. తాజాగా ఆదివారం (జూన్ 30) మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అది నిజంగా ఒక అద్భుతం అంటూ.. 2016లో తన విశాఖ పర్యటనలో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన ఫొటోను షేర్ చేశారు.  

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు. 
టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణ వినిపించాయి.
 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది.
లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది.
తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు.
తొలుత నుంచి వివాదాస్పద వ్యక్తి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్  రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు.
ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.
ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.