ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క

Publish Date:Sep 21, 2026

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అక్టోబర్ 2న జరగనున్న గ్రామసభలు, ఎల్‌నినో ప్రభావం, ఉపాధి హామీ పనులు, జలసిరి కార్యక్రమం, గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి చర్చించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, అడిషనల్ కమిషనర్ పి. రవీందర్‌తో పాటు శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీలో ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌పై చర్చించి తీర్మానం చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. అక్టోబర్ 2న ప్రతి గ్రామపంచాయతీ లో నిర్వహించే గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించి, గ్రామస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానాలు చేయాలని సూచించారు. గ్రామానికి అవసరమైన పనులు, అందుబాటులో ఉన్న నిధులు, వచ్చే ఏడాది వివిధ శాఖల ద్వారా గ్రామపంచాయతీలకు అందే నిధులపై గ్రామసభల్లో సమగ్రంగా చర్చించాలని అన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని గ్రామపంచాయతీలకు ఒకే తరహా అభివృద్ధి ప్రణాళిక కాకుండా గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న నిధులను బట్టి పనులను ఎంపిక చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో శాశ్వత సామాజిక ఆస్తులు ఏర్పడేలా పనులు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.6,700 కోట్లను ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో సగటున సుమారు రూ.50 లక్షల విలువైన పనులు జరిగే అవకాశం ఉందన్నారు. పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఎల్‌నినో నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 

జలసిరి కార్యక్రమాన్ని వేగవంతం చేసి నీటి సంరక్షణ, నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల వారీగా నియమించిన ప్రోగ్రామ్ మానిటరింగ్ అధికారులు వచ్చే రెండు రోజులపాటు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని మంత్రి తెలిపారు. గ్రామసభలు, ఎల్‌నినో యాక్షన్ ప్లాన్, ఉపాధి హామీ, జలసిరి కార్యక్రమాలపై కింది స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు.కేవలం కార్యాలయాల్లో సమావేశాలకే పరిమితం కాకుండా అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీతక్క తెలిపారు. ప్రజలకు ఉపాధి, గ్రామాలకు మౌలిక వసతులు, నీటి భద్రత, శాశ్వత సామాజిక ఆస్తులు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

 

 

[ Model Panchayat, Minister Seethakka, Telangana Panchayat Raj Department, CM Revanth reddy, El Nino effect, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కల సాకార దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి..!
పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
హుస్సేన్‌సాగర్ వద్ద బారికేడ్లు తొలగించిన ఉత్సవ సమితి.. పలువురు అరెస్ట్..!
బీఆర్‌ఎస్ సీనియర్ నేత,  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంతో వనపర్తిలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
తన జన్మదిన వేడుక అన్నది  ఏ  రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన ప్రీతీరెడ్డి...  ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలు కేవలం తన శ్రేయోభిలాషులు, అభిమానులు, కాలేజీ సిబ్బంది,   ఆసుపత్రి స్టాఫ్ తమ అభిమానంతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినవన్నారు.  పుట్టినరోజు వేడుకలను కూడా రాజకీయం చేస్తూ తమ ఫ్లెక్సీలను చింపేయడం, వికృత చేష్టలకు పాల్పడడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జరిగిన హృదయ విదారక ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
సత్యం స్కాం భూములు.. కేటీఆర్ కుటుంబం చేతికి ఎలా వచ్చాయి..?
లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేల దాడి..!
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే చప్పుళ్లకు వరుస గుండెపోటు మరణాలు..!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.