పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే ఎలా...సొంత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
Publish Date:Oct 5, 2025
Advertisement
తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తోంది..? అని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా ? క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని చూసుకోవాలని ఆయన అన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలకు రావడం, వెళ్లడమే తమ పనా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలేవీ..? అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే సరిపోతుందా ? అని కాటిపల్లి ప్రశ్నించారు. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. నేతల మధ్య సఖ్యత ఎందుకు లేదని ఎంపీ కొండా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధిగమించి ముందుకెళ్దామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చెప్పుకొచ్చారు.
http://www.teluguone.com/news/content/mla-katipally-venkataramana-reddy-39-207400.html





