మెదక్ లోక్ సభ పై కన్నేసిన ప్రభుత్వ విప్ జయప్రకాష్ రెడ్డి

Publish Date:Mar 6, 2012

Advertisement

మెదక్: సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి మెదక్ లోక్ సభ స్థానంపై కన్నేశారు. 2014లో జరగబోయే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మెదక్ లోక్ సభ స్థానంనుంచి పోటీచేస్తానని ప్రకటించారు. అధిష్టానంనుంచి ఎటువంటి భరోసాలేనప్పటికీ జయప్రకాశ్ రెడ్డి ఇటువంటి ప్రకటన చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. అంతేకాకుండా ఆయన మరో ప్రకటనచేస్తూ మెదక్ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతికి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వడం లేదని కూడా జోస్యం చెప్పారు. ఈ ప్రకటన టిఆర్ఎస్ శ్రేణులను గందరగోళంలో పడేసింది. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు తన గురించే కాకుండా ఇతర పార్టీల అభ్యర్ధులపై కూడా జయప్రకాష్ రెడ్డి మాట్లాడటంలో అతని అంతర్యమేమిటని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో విజయశాంతిపై  పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి చాగండ్ల నరేంద్ర నాధ్ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిజానికి ఆయన మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి తనకు పోటీగా వస్తానంటూ ప్రకటించడం నరేంద్ర నాధ్ ను కలవరపరుస్తోంది. విమర్శలతో సంచలనాలు సృష్టించే ఎమ్మెల్యేగా పేరుబడ్డ జయప్రకాష్ రెడ్డి తాజా ప్రకటన జిల్లాలో ఎలాంటి రాజకీయ పరిస్థితులను సృస్టించనుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

By
en-us Political News

  
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.