నిజాం ఆభరణాల డీల్ లో 50 కోట్లు భారీ మోసం!

Publish Date:Apr 15, 2026

Advertisement

హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి ఆభరణాల పేరుతో  50 కోట్ల రూపాయల మోసం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త  రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నగరానికి చెందిన మరో వ్యాపారవేత్త  ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్  సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  కాగా  గుప్తా ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో  ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.  

నిజాం కాలం నాటి ఐదు ఆభరణాల పెట్టెలు ప్రభుత్వ కస్టడీలో చిక్కుకుపోయాయనీ, చట్టపరమైన ఖర్చులు భరించి వాటిని విడుదల చేయిస్తామని నిందితులు హామీ ఇచ్చినట్లు అగర్వాల్ చెబుతున్నారు. దీంతో  2016 జూన్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య తాను రూ.50.8 కోట్లు వివిధ కంపెనీల ద్వారా బదిలీ చేశానని ఆయన పేర్కొన్నారు. కానీ ఆభరణాలు విడుదలకు దగ్గరపడిన సమయంలోనే అసలు కథ బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆభరణాల విడుదలకు ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించ డంతో పాటు, ఆభరణాలను స్వతంత్రంగా తమ పేర్లతో  స్వాధీనం చేసుకుని విక్రయించే ప్రయత్నం చేశారని అగర్వాల్ ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. 

ఈ ఆభరణాలకు దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 1958లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాం ఆభరణాలను వారసుల నుంచి రిజిస్టర్డ్ అసైన్‌మెంట్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఆభరణాలు  ప్రభుత్వ కస్టడీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఆ ఐదు పెట్టెల్లో అసలు ఏముంది? వాటి విలువ ఎంత? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్‌కు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 406,  కామన్ ఇంటెన్షన్ సెక్షన్ 34 కింద ఉస్మాన్ మరియు గుప్తలపై కేసు నమోదు చేశారు. నిందితుల వాంగ్మూలాలను సేకరించి ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నిజాం ఆభరణాల పేరుతో ప్రారంభమైన ఈ భారీ డీల్… ఇప్పుడు భారీ మోసం కేసుగా మారి నగర వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.