బొల్లారం ఆయుధాల చోరీలో మాజీ హవల్దార్‌ అరెస్ట్‌..!

Publish Date:Sep 11, 2026

Advertisement

నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!

 బొల్లారం ఆర్మీ హెడ్‌క్వార్ట ర్స్‌లోని ఆయుధాల భద్రతా గదుల నుంచి తుపాకులు, మందు గుండు సామగ్రి మాయ మైన కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసులో మాజీ ఆర్మీ హవల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేష్‌ అలియాస్‌ రాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. బొల్లారం పోలీసులు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, మల్కాజిగిరి కమిషనరేట్‌ ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఆగస్టు 30, 31 తేదీల మధ్య అర్ధరాత్రి బొల్లారంలోని 20వ బెటాలియన్‌, మద్రాస్‌ రెజిమెంట్‌ పరిధిలోని ఆయుధాల భద్రతా గదుల నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. 

ఆగస్టు 31 తెల్లవారుజామున ఆయుధాలు కనిపించకపోవడాన్ని ఇన్‌చార్జి వినోద్‌కుమార్‌ నాయక్‌ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన ఆయుధాల జాబితా పోలీసులను ఆందోళనకు గురిచేసింది. మొదటి భవనం నుంచి ఏడు పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, నాలుగు ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం క్యాలిబర్‌కు సంబంధించిన మందుగుండు సామగ్రితోపాటు మరికొన్ని ఆయుధాలు మాయమైనట్లు గుర్తించారు. రెండో భవనం నుంచి కూడా కొన్ని ఆయుధాలు, బుల్లెట్లు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.


ఇంత భారీగా ఆయుధాలు భద్రతా గదుల నుంచి ఎలా బయటకు వెళ్లాయన్నదానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తొలుత బయట వ్యక్తుల కంటే ఆయుధాల భద్రత, వినియోగం గురించి పూర్తి అవగాహన ఉన్న లోపలి వ్యక్తుల పాత్రపైనే అనుమానం వ్యక్తమైంది. ఆయుధాలను క్రమం తప్పకుండా వినియోగించే 16 మంది సిబ్బంది వివరాలను పరిశీలించడంతోపాటు సెలవులో ఉన్న 54 మంది సైనికుల కదలికలను కూడా పోలీసులు ఆరా తీశారు. సర్వీసు నుంచి బయటకు వెళ్లిన ఏడుగురు పెన్షన్‌ ఔట్‌ సిబ్బందిని విచారించారు. ఈ క్రమంలో ఎన్‌సీవో వినోద్‌కుమార్‌, బల్లి మధు సహా పలువురిని విచారించినప్పటికీ కీలక ఆధారాలు లభించలేదు. 

సాంకేతిక ఆధారాలు, వేలిముద్రలు, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో దర్యాప్తు కొనసాగించగా మాజీ హవల్దార్‌ ఉప్పుతోళ్ల మల్లేష్‌పై పోలీసుల అనుమానం బలపడింది. 37 ఏళ్ల మల్లేష్‌ 2010లో భారత సైన్యంలో చేరారు. 20వ బెటాలియన్‌, మద్రాస్‌ రెజిమెంట్‌లో సుమారు 16 ఏళ్లపాటు సేవలందించారు. ఈ ఏడాది జూన్‌ 30న సర్వీసు నుంచి రిటైర్‌ అయ్యారు. ముందస్తు రిటైర్మెంట్‌ కారణంగా అసంతృప్తితోనే ఆయుధాల చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం సెలవుపై వచ్చిన మల్లేష్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

మల్లేష్‌ స్వస్థలమైన నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల ప్రాంతంలోని ఉడుమిల్లలోని ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ పలు మోడళ్ల తుపాకులు లభించినట్లు సమాచారం. వాటిలో బొల్లారం నుంచి చోరీకి గురైన ఆయుధాలు ఏవో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేట ప్రాంతాల్లోనూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దాచినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

అయితే ఈ ఆయుధాల చోరీ వెనుక మరేదైనా పెద్ద నెట్‌వర్క్‌ ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడికి తరలించారు? వాటిని ఎవరికి ఇవ్వాలనుకున్నారు? మల్లేష్‌కు మరెవరైనా సహకరించారా? ఆయుధాలకు డ్రగ్‌ మాఫియాతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్కాజిగిరి పోలీస్‌ జోన్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌, మల్కాజిగిరి ఎస్‌ఓటీ, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, తెలంగాణ స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మల్లేష్‌ను గుర్తించి సెప్టెంబర్‌ 11న అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఆయుధాల చోరీకి దారితీసిన పరిస్థితులు, చోరీ చేసిన ఆయుధాలను ఎక్కడెక్కడికి తరలించారు, ఈ వ్యవహారంలో ఇంకెవరైనా సహకరించారా అన్న విషయాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

[ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]


 

By
en-us Political News

  
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.