కాంగ్రెస్ హోం వర్క్ చేయలేదు అన్నాబృందం
Publish Date:Dec 31, 2011
Advertisement
న్యూఢిల్లీ: రాజ్యసభలో లోక్పాల్ బిల్లుపై ఆమోదముద్ర వేయించేందుకు అవసరమైన హోంవర్క్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చేయలేదని అన్నా బృందం ఆరోపించింది. దీనిపై ఆ బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ పటిష్టమైన లోక్పాల్ బిల్లును తెచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు. అందుకే రాజ్యసభలో దురుద్దేశ్యపూరితంగా హైడ్రామా సృష్టించిందని ఆరోపించారు.రాజ్యసభలో జరిగిన పరిణామాలకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వతంత్ర సీబీఐ, లోక్పాల్ ఎంపిక, తొలగింపు ప్రక్రియ, బిల్లు నుంచి లోకాయుక్తను వేరు చేయడం వంటి మూడు సవరణలను ప్రభుత్వం ఆమోదించి ఉంటే విపక్షాల పూర్తి మద్దతుతో లోక్పాల్ సాకారమయ్యేదని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokpal-bill-24-10439.html
http://www.teluguone.com/news/content/lokpal-bill-24-10439.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





