ఖైరతాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదం...అపార్ట్‌మెంట్‌లో విషాదం

Publish Date:Jun 6, 2026

Advertisement

హైదరాబాద్ ఖైరతాబాద్‌ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుము కున్నాయి.  ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ(58) అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు. అయితే కొద్దిసేపు లిఫ్ట్ డోర్ తెరుచు కోకపోవ డంతో ఆమె అక్కడే వేచి ఉన్నారు. తర్వాత మరో సారి డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అదే సమ యంలో లిఫ్ట్ క్యాబిన్ ఐదవ అంతస్తుకు చేరక ముందే డోర్ తెరుచుకోవ డంతో, లోపల ఖాళీ షాఫ్ట్ ఉందని గమనించకుండా రాధ లోపల అడుగు పెట్టారు.

ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి ఆమె ఐదవ అంతస్తు నుండి మొదటి అంతస్తులో పడిపోయారు. ఈ ప్రమాదంలో రాధ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.ఆమె చేతిలో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్‌ మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని రాధ, బాలుడిని లిఫ్ట్ గుంతలో నుండి బయటకు తీశారు. అయితే అప్పటికే రాధ మృతి చెందినట్లు నిర్ధారిం చారు. తీవ్ర గాయాలైన బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు.
 

By
en-us Political News

  
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.