టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు. ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలం మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని గౌతమీ, వశిష్ట, లక్ష్మీ నదుల పవిత్ర సంగమమైన 'మునికూడలి' వద్ద ఘాట్‌ను సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
ఆ ఘాట్‌కు 'దేవాన్ష్ ఘాట్' అని పేరు పెట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘాట్‌ను పరిశీలించిన సమయంలో అక్కడ దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యుడి పేరు పెట్టడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అది లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఏ ఘాట్‌కు కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pushkar-ghat-named-after-devansh-36-222104.html
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.