లాలూ దంపతులకు జడ్ ప్లస్ భద్రత తొలగింపు

Publish Date:Jun 6, 2026

Advertisement

 

లాలూ ఇంటి వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా..

బిహార్ మాజీ  ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది. అయితే ఈ చర్యను లాలూ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమకు ప్రభుత్వం కేటాయించిన భద్రత వద్దంటూ ఇంటి నుంచి పోలీసులను పంపేసింది. దీంతో పాట్నాలోని 10- సర్క్యులర్ రోడ్‌లోని లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, నేతలు కర్రలతో కాపలా కాస్తున్నారు.

ఇక, బిహార్‌ ప్రతిపక్ష నేత హోదాలో లాలూ కుమారుడు తేజస్వీయాదవ్‌కు వై-ప్లస్‌, అలాగే ఎంపీ మిసా భారతికి ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించనున్నట్లు బిహార్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు మాత్రం ప్రస్తుతం ఉన్న వై-ప్లస్‌ భద్రతను తొలగించి.. ఓ కానిస్టేబుల్‌ను కేటాయించింది. ఈ పరిణామాలపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనకు కల్పించిన వై-కేటగిరీ భద్రతను వెనక్కి పంపారు. దీనిపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య దీనిపై స్పందిస్తూ.. తమ కుటుంబానికి హాని తలపెట్టాలనే దురుద్దేశంతోనే జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు

By
en-us Political News

  
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.