ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల టోకరా...సుబ్బారెడ్డి అరెస్ట్

Publish Date:Jun 6, 2026

Advertisement

 

తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న మెసారా ఇన్ఫ్రా డెవలపర్ అధినేత మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డిని మాదాపురం పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బారెడ్డి శనివారం ఉదయం హైటెక్ సిటీలో ఒక హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సమాచారం తెలుసుకున్న బాధితులు, మాదాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సుబ్బారెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న హోటల్ కి వెళ్లిన పోలీసులు, సుబ్బారెడ్డిని అరెస్టు చేశారు. ఏపీలో కూడా సుబ్బారెడ్డి పై కేసులు నమోదై ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో  పెంచల సుబ్బారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి.  తెలంగాణ రాష్ట్రం వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పను కూడా కోటి రూపాయలు మోసం చేసిన దాంట్లో సుబ్బారెడ్డి పై గద్వాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

ఇతను గత రెండేళ్లుగా వివాదాస్పద భూములపై ఫ్రీ లాంచ్ వెంచర్లంటూ అందమైన బ్రోచర్లతో వందలాదిమందిని ముంచి సుమారు రూ.100 కోట్లకు పైగా దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు బాధితులకు చిక్కిన మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి మాదాపురం పోలీసులు అదుపులో ఉన్నాడు. లేని భూమిని ఉన్నట్టు చూపించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న సుబ్బారెడ్డి ఇప్పుడు అరెస్టు అయ్యాడు.

By
en-us Political News

  
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.