Publish Date:Jul 18, 2026
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
Publish Date:Jul 18, 2026
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
Publish Date:Jul 18, 2026
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
Publish Date:Jul 18, 2026
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
Publish Date:Jul 18, 2026
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
Publish Date:Jul 18, 2026
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
Publish Date:Jul 17, 2026
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jul 17, 2026
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
Publish Date:Jul 17, 2026
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jul 17, 2026
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Publish Date:Jul 17, 2026
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
Publish Date:Jul 17, 2026
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jul 17, 2026
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సబ్‌స్క్రైబర్లలో భారీ మార్పు! మొదటి సీజన్ తర్వాత 70 శాతానికి పైగా వ్యూయర్స్ షోలను ఎందుకు వదిలేస్తున్నారో బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.